Post Views: 69
వి 1 న్యూస్.బోధన్, ఆగస్టు 16
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని గంజి రోడ్డులో గల శ్రీ రాధాకృష్ణ మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉదయం కృష్ణ భగవానునికి అభిషేకం అనంతరం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భగవత్సన్నిధిలో తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఈ పూజా కార్యక్రమాలను ఆలయ పూజారులు శ్రీ మనోజ్ పాఠక్, శ్రీ సంజీత్ పాండే లు నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు అశోక్ రావు కులకర్ణి, కోశాధికారి పబ్బ మురళి పాల్గొన్నారు. అలాగే ఆలయంలో ప్రత్యేకంగా నిర్వహించిన కుంకుమార్చనలో రవీందర్ యాదవ్ దంపతులు మరియు అనేక మంది భక్తులు పాల్గొని శ్రీకృష్ణుని ఆశీర్వాదాలు పొందారు.
పూర్తి భక్తి వాతావరణంలో సాగిన ఈ వేడుకలు ఆలయ పరిసరాలను ఉత్సవ మయంగా మార్చాయి.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








