– ప్రమాద బాధితుడికి నాలుగు నెలలుగా ఆర్థిక సహాయం అందజేత
– పలు సేవా కార్యక్రమాల పట్ల అభినందిస్తూ, ప్రశంసలు కురిపిస్తున్న నియోజకవర్గ ప్రజలు
– బిజెపి నాయకులు, NRI, కోనేరు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు కోనేరు శశాంక్
రుద్రూర్ ప్రతినిధి:
నిజామాబాద్ జిల్లా: బిజెపి నాయకులు, NRI, కోనేరు శశాంక్ రుద్రూర్ మండల కేంద్రంలో ఏముల సాయిలు అనే వ్యక్తి ఇంటి వద్దకు వెళ్లి రూ.5000 ఆర్థిక సహాయాన్ని అందజేసి వారిని ఓదార్చారు. వివరాల్లోకి వెళితే నాలుగు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో ఏముల సాయిలు తీవ్రంగా గాయపడి ఇబ్బందులకు గురయ్యారు. ఆ సమయంలో విషయం తెలుసుకున్న కోనేరు శశాంక్ మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి వారి ఇంటికి వెళ్లి ఆర్థిక సహాయం అందించి ఓదార్చి, భరోసానిచ్చారు. అదేవిధంగా ప్రతినెల కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మందులు (మెడిసిన్) కొనుగోలు చేసుకోవడానికి ఆర్థిక సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం గత నాలుగు నెలల నుండి రూ.5000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తూ అండగా నిలుస్తున్నారు. కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తూ ఆదుకోవడం పట్ల బాధితుడు మరియు అతని కుటుంబ సభ్యులు కోనేరు శశాంక్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలతో పేద ప్రజలకు అండగా నిలుస్తున్నందుకుగాను ఆయనను నియోజకవర్గ ప్రజలు ప్రశంసలు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి కామారెడ్డి జిల్లా కౌన్సిల్ మెంబర్ సున్నం సాయిలు, బిజెపి బాన్సువాడ నియోజకవర్గ సీనియర్ నాయకులు మర్కేలి ప్రకాష్ పటేల్, బిజెపి రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, ఏముల గజేందర్, ప్రశాంత్ గౌడ్, మోహన్, సంజీవ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








