నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: 79 వ స్వాతంత్ర వేడుకలను పురస్కరించుకొని శుక్రవారం రోజు నసురుల్లాబాద్ మండల కేంద్రంలో గల ఉన్నత పాఠశాల లో నిర్వహించిన జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమానికి బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు గత సంవత్సరం బిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ తరపున విద్యార్థులు కష్టపడి చదువుకొని మెరుగైన ఫలితాలను సాధించాలనే సంకల్పంతో వారికి నగదు ప్రోత్సాహకాలను ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం శుక్రవారం రోజు పాఠశాలలో గత సంవత్సరం పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన ముగ్గురు విద్యార్థులను ఘనంగా సత్కరించి ప్రథమ బహుమతి రూ.5000, ద్వితీయ బహుమతి రూ.3000, తృతీయ బహుమతి రూ.2000 అందించారు. ఈ సందర్భంగా MEO చందర్ మరియు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. హన్మండ్లు లను శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా MEO చందర్ మాట్లాడుతూ విద్యార్థులలో కష్టపడే తత్వాన్ని మరియు పోటీపడి చదువుకొని ఉత్తమ ఫలితాలు సాధించుకునే విధంగా వారికి నగదు ప్రోత్సాహకాలు అందించినందుకుగాను బిఆర్ఎస్ పార్టీ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని మెరుగైన ఫలితాలను సాధించి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, గ్రామానికి మంచి పేరు సాధించి పెట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ లు అరిగె సాయిలు, వనం వెంకటేశ్వర్ రావు, దంతూరి మైషాగౌడ్, మామిడి భూమయ్య, బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు గొడిసెల నర్సింలు గౌడ్, టేకుర్ల సాయిలు, మోసిన్, మంగలి సాయికుమార్, దొంతి భాస్కర్, అల్లం గంగారం, తర్ణం పోచయ్య, గ్రామ పెద్దలు, యువకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








