– బిజెపి రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ
రుద్రూర్ ప్రతినిధి:
నిజామాబాద్ జిల్లా: 79 వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రుద్రూర్ మండల కేంద్రంలో గల భారతీయ జనతా పార్టీ కార్యాలయం ఆవరణలో శుక్రవారం రోజు మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి కామారెడ్డి జిల్లా కౌన్సిల్ మెంబర్ సున్నం సాయిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ ఎందరో స్వాతంత్ర సమరయోధులు, త్యాగదనులు వారి జీవితాలను బ్రిటిష్ వారితో ధైర్యంగా, ప్రాణాలకు తెగించి పోరాటం వలన దేశానికి స్వాతంత్రం వచ్చిందని అన్నారు. ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతృత్వంతో విరాజిల్లే స్వతంత్ర భారతావనిగా భారతదేశం పేరు పొందిందని తెలిపారు. భవిష్యత్తులో అందరూ కలిసిమెలిసి దేశాభివృద్ధిలో పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సీనియర్ నాయకులు మార్కెలి ప్రకాష్ పటేల్, ప్రశాంత్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి ఏముల గజేందర్, బేగరి శివప్రసాద్, జీలకర్ర విజయ్, ఈరోళ్ల గంగాధర్, శ్రీనివాస్, బేగరి వినోద్ కుమార్, బేగరి సాయికుమార్, మహిళా మోర్చా అధ్యక్షులు నాగరాజకుమారి, అంకె రాజేష్, మండల కోశాధికారి కటికె రామరాజు, చిదుర వెంకటేశం గుప్తా, చిదుర మహిపాల్, సంజీవ్, చిదుర హరి రామ్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








