Post Views: 237
భైంసా, ఆగస్టు 12:
మాదకద్రవ్యాల వాడకం వల్ల కలిగే హానికర ప్రభావాలపై యువతలో అవగాహన కల్పించేందుకు భైంసా ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం నిర్మల్ జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు షేక్ నోమన్ అధ్యక్షతన, వైట్ టీ-షర్ట్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగింది.
కార్యక్రమంలో భైంసా అసిస్టెంట్ ఎస్పీ అవినాష్ కుమార్, సీఐ జి. గోపీనాథ్, ఎఎంసి చైర్మన్ ఆనంద్ రావు పటేల్, సైకాలజిస్ట్ డా. సురేష్, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శివరంజని రెడ్డి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్ ఎం.ఎ. రషీద్ తదితరులు పాల్గొని, మాదకద్రవ్యాల వాడకం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యంపై కలిగే తీవ్రమైన నష్టాలపై వివరణ ఇచ్చారు.
భైంసా ఎఎస్పీ అవినాష్ కుమార్ మాట్లాడుతూ, మాదకద్రవ్యాలు కాలేయం, గుండె, మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతాయని, నిరాశ, ఆందోళన, మానసిక ఒత్తిడికి కారణమవుతాయని తెలిపారు. గంజాయి, సత్తా, మట్కా వంటి అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు, ప్రజలు అనుమానాస్పద విషయాలను వెంటనే పోలీసులకు తెలపాలని విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమం ముగింపులో, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై రాతపూర్వక పోటీ నిర్వహించి, విజేతలకు సర్టిఫికెట్లు, పతకాలు అందజేశారు. విద్య, క్రీడల ద్వారా మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ యువ నాయకుడు మోయిజ్ అహ్మద్, యూత్ కాంగ్రెస్ బృందం మరియు స్థానిక యువత పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








