Post Views: 105
భైంసా, ఆగస్ట్ 8 (ప్రతినిధి):
ముధోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి శ్రీ బస్లీ నారాయణరావు పటేల్ ను నేడు భైంసా పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కుబీర్ మండల నిగువ గ్రామ ప్రజలు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ – “2004లో గ్రామం ముంపుకు గురైన సమయంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 18 ఎకరాల భూమిలో ప్లాట్లు ఏర్పాటు చేయడంతో పాటు, సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, పెద్ద వాటర్ ట్యాంక్ నిర్మించారని, దాదాపు వంద కోట్ల రూపాయలతో ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. అయితే ఆ తర్వాత మీ ఓటమి, తదుపరి ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఇప్పటికీ ఆ ప్లాట్లు పంచబడలేదు,” అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సమస్యను వెంటనే పరిష్కరించేందుకు నారాయణరావు పటేల్ హామీ ఇచ్చారు. ఎమ్మార్వోతో తక్షణమే ఫోన్‌లో మాట్లాడిన ఆయన, మూడురోజుల్లో సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. అదేవిధంగా 168 లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తానని గ్రామస్తులకు భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్ చంద్రె బోలా, కుబీర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బషీర్, సీనియర్ నాయకులు బంక బాబు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు జాడే శ్రీనివాస్, శివాజీ, జాడే సంత్రం, సాహెబ్రావ్, మహిళలు తదితరులు పాల్గొన్నారు
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








