Post Views: 213
ఖాజాపూర్ పాఠశాలలో రక్షాబంధన్ ఉత్సాహంగా…
సాలుర: మండలంలోని ఖాజాపూర్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో గురువారం నాడు ముందస్తు రక్షాబంధన్ వేడుకలు ఉత్సాహభరితంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు రాఖీ పండుగ వెనక ఉన్న భారతీయ సాంప్రదాయాలను విద్యార్థులకు వివరించారు. రక్షాబంధన్ పండుగ సోదర-సోదరీల మానసిక బంధాన్ని ప్రతిబింబించేదిగా పేర్కొన్నారు.
ప్రతి స్త్రీలో సోదరిని చూసే దృక్పథం భారతీయ సంస్కృతిలో ఉన్నదని, సోదరి తన సోదరుని క్షేమం కోసం రాఖీ కడుతుందన్న భావాన్ని వివరించారు. విద్యార్థులు పరస్పరం రాఖీలు కట్టి “నీవు నాకు రక్ష.. నేను నీకు రక్ష.. మనమిద్దరం దేశానికి రక్ష” అంటూ నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభ, ఉపాధ్యాయులు, పిఆర్టియు మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ సాయిలు, హన్మండ్లు తదితరులు పాల్గొన్నారు
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








