V1News Telangana

best news portal development company in india

నిజాం షుగర్ ఫ్యాక్టరి పునరుద్దరణ ఉద్యమానికి మద్దతివ్వండి మందకృష్ణకు వినతిపత్రం

SHARE:

ఈరోజు ఆర్మూర్ పట్టణంలో మందకృష్ణ మాదిగను కలిసిన అడ్లూరి శ్రీనివాస్,ఫ్యాక్టరీ కార్మికులు,బోధన్ యువత

నిజామాబాద్‌ జిల్లా పేరెత్తగానే పసుపుతో పాటు ప్రసిద్ధి చెందిన పంట చెరకు. అంత ప్రసిద్ధి కాబట్టే జిల్లాలోని బోధన్‌లో అతిపెద్ద చక్కెర కర్మాగారం వెలిసింది. ఐతే కర్మాగారం మూతపడి ఏళ్లు గడవడస్తున్న చెరకు సాగు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కర్మాగారాన్ని తెరిపిస్తామన్న అంశం ఇన్నాళ్లూ రాజకీయ హామీగా మిగిలిపోగా పునరుద్ధరిస్తామన్న కొత్త ప్రభుత్వ ప్రకటనతో రైతులు, కార్మికుల్లో ఆశలు చిగురించాయి. పరిశ్రమను తిరిగి తెరిపించేందుకు అవసరమైన సిఫార్సుల కోసం ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రభుత్వం కమిటీ వేసింది. సాధ్యాఅసాధ్యాలు, పరిశ్రమలో ప్రస్తుత పరిస్థితులు, అయ్యే వ్యయం, తీర్చాల్సిన అప్పులు.. ఇలా అన్నింటిపై కమిటీ అధ్యయనం చేసి 2 నెలల్లోగా కమిటీ తన నివేదిక ఇవ్వాల్సి ఉండగా ఇంకా కాలయాపన జరుగుతుందని ఈ నేపథ్యంలో ఫ్యాక్టరీ పరిశ్రమ తిరిగి తెరుచుకుంటే బోధన్ ప్రాంతం పూర్వ వైభవం సంతరించుకుంటుందని గౌరవ పద్మశ్రీ అవార్డు గ్రహీత MRPS వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ గారిని బి.జె.పి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడ్లూరి శ్రీనివాస్ (నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు )గారి ఆధ్వర్యంలో నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ కార్మికుల వేతన బకాయిలు మరియు ఫ్యాక్టరీ రీ ఓపెన్ కోసం భవిష్యత్తు లో ఉద్యమం కోసం మద్దతు కోరి వినతి పత్రం సమర్పించి, వారికి కార్మికుల సమస్యలను విన్నవించడం జరిగింది.దానికి వారు సానుకూలంగా స్పందించి భరోసా ఇవ్వడం జరిగింది కార్యక్రమంలో గోసంగి రాష్ట్ర అధ్యక్షులు గంధం రాజేష్,కార్మిక సంఘం నాయకులు నాగుల రవిశంకర్ గౌడ్, ఎం. శ్రీనివాస్ పాల్గొనడం జరిగింది.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....