Post Views: 376
పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ మెరుపుదాడి: 8 మంది అరెస్ట్ – రూ.69,710 నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం
వి1 న్యూస్.నిజామాబాద్, ఆగస్ట్ 4:
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, IPS గారి ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు కీలక దాడులు నిర్వహించారు. టాస్క్‌ఫోర్స్ ఇంచార్జ్ ఏసీపీ నాగేంద్ర చారి గారి పర్యవేక్షణలో, ఇన్స్పెక్టర్ అంజయ్య, ఎస్సై శివరామ్ మరియు సిబ్బంది సమర్థంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో ఏర్గట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని బట్టపూర్ గ్రామ శివారులో గల ఒక ఫార్మ్ హౌస్‌లో సాగుతున్న పేకాట స్థావరాన్ని బహిర్గతం చేశారు.
ఈ దాడిలో మొత్తం 8 మంది పేకాట రాయుళ్లను పట్టుకొని, వారి వద్ద నుండి 8 సెల్ ఫోన్లు, రూ. 69,710 నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారిని మరియు స్వాధీనమైన వస్తువులను తదుపరి విచారణ నిమిత్తం ఏర్గట్ల ఎస్‌ఎచ్ఓ (SHO) గారికి అప్పగించారు.
సమాజంలో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీసులు చేపడుతున్న చర్యలు ప్రశంసనీయం. కమిషనర్ ఆదేశాలతో ఇలాంటివి నిరంతరం కొనసాగుతాయని అధికారులు తెలిపారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








