Post Views: 69
బోధన్‌లో MRPS ఆధ్వర్యంలో పింఛన్ దారుల గళం
వీ1 న్యూస్, ఆగస్టు 3 – నిజామాబాద్ జిల్లా బోధన్ మండల కేంద్రంలో ఆదివారం రోజు వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు తదితర చేయూత పింఛన్ దారుల ‘మహా గర్జన’ సన్నాహక సదస్సు MRPS మండల ఇన్‌చార్జి మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి లసింగారి భూమయ్య మాదిగ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడింది.ఈ సదస్సులో ముఖ్య అతిథిగా హాజరైన VHPS జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ మాట్లాడుతూ,
“ప్రముఖ నేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో తక్షణమే ఉద్యమానికి సిద్ధం కావాలి. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం చేయూత పింఛన్లు పెంచకపోతే రాజీనామా చేయాలి” అని ఘాటుగా హెచ్చరించారు.
*ఆగస్టు 13న హైదరాబాద్‌లో జరిగే “చలో హైదరాబాద్ మహా గర్జన సభ”*ను విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. అదే విధంగా, ఈ నెల 5న ఆర్మూర్‌కు వస్తున్న మందకృష్ణ మాదిగ గారి పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.
డిమాండ్లు ఈవిధంగా ఉన్నాయి:
వికలాంగులకు నెలకు రూ.6000 ఇవ్వాలి
వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేత, గీత, బీడీ కార్మికులకు రూ.4000 చొప్పున పెన్షన్ ఇవ్వాలి
కండరాల క్షీణత బాధితులకు నెలకు రూ.15000 మంజూరు చేయాలి
ఈ కార్యక్రమంలో VHPS జిల్లా అధ్యక్షుడు బీరప్ప, ఉపాధ్యక్షుడు సలీం, MMS జాతీయ నాయకురాలు యమున, జిల్లా కన్వీనర్ గుమ్ముట్టు పద్మ, సావిత్రి, MRPS జిల్లా సహాయ కార్యదర్శి బండారి పోషేట్టి, కార్యదర్శి సోంపూర్ పోచిరాం మాదిగ, VHPS నేతలు అబ్బన్న, భాండే శివకాంత, కిన్నెర మోహన్, ఎర్రోళ్ల మారుతి, భూషణ్, అబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
వికలాంగులు, వృద్ధులు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలను వ్యక్తపరిచారు. ప్రభుత్వాన్ని కదిలించేందుకు చలనం మొదలైంది.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








