Post Views: 355
నిజామాబాద్, ఆగస్టు 3:
నిజామాబాద్ నగరంలోని దేవి రోడ్, బస్టాండ్, ప్రభుత్వ ఆసుపత్రి పరిసర ప్రాంతాలు ప్రజల రాకపోకలకు ప్రధాన కేంద్రంగా మారిన వేళ, అక్కడ నెలకొంటున్న అక్రమ కార్యకలాపాలు ఆరోగ్య భద్రతకు సవాల్‌గా మారుతున్నాయి. అపరిశుభ్ర వాతావరణం, సరిగ్గా లేని శానిటేషన్, నిబంధనల్ని విస్మరించి నడుస్తున్న టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ దుకాణాల వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గృహ గ్యాస్ వినియోగంలో అక్రమం –
ప్రభుత్వ ఆదాయానికి గండి
వాణిజ్య అవసరాలకు కమర్షియల్ గ్యాస్ వినియోగించాల్సినప్పటికీ, తక్కువ ధర ఉన్న గృహ వినియోగ (ఎరుపు రంగు) సిలిండర్లను అక్రమంగా వాడుతున్నారు. ఈ చర్య ద్వారా వ్యాపారులు భారీ లాభాలు పొందుతుండగా, ప్రభుత్వ ఆదాయానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. కమర్షియల్ సిలిండర్ ధర రూ.2000 పైగా ఉండగా, గృహ సిలిండర్ ధర సుమారు సగం మాత్రమే.
ప్రమాదకర వాతావరణం –
ఫ్లైఓవర్ కింద ప్రమాదాలు
ఫ్లైఓవర్ కింద విద్యుత్ తీగలు పిల్లర్లకు తగిలి ఉండటం, ఎగ్జిట్ ఫ్యాన్‌లు రోడ్లపై పనిచేయడం వంటి పరిస్థితులు ప్రజల ప్రాణాలకు ప్రమాదంగా మారుతున్నాయి. అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ ప్రాంతం మరింత ప్రమాదకరంగా మారుతోందని ప్రజలు వాపోతున్నారు.
ప్రజా సంఘాల డిమాండ్
ఈ నేపథ్యంలో ప్రజా సంఘాలు, స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వారు ఈ క్రింది డిమాండ్లు ఉంచుతున్నారు:
అక్రమంగా గృహ గ్యాస్ వినియోగిస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలి
సంబంధిత లైసెన్సులు రద్దు చేయాలి
ఆహార నాణ్యత తనిఖీకి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలి
నియమితంగా పర్యవేక్షించే మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయాలి
సమగ్ర తనిఖీలు, కఠిన చర్యల ద్వారానే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడగలం అని వారు పేర్కొంటున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....












