Post Views: 125
నిజామాబాద్ నగరంలోని ఈఎస్ఐ ఆసుపత్రిలో అస్తవ్యస్త పాలన కొనసాగుతుంది.నిజామాబాద్ నగరంలోని ఈఎస్ఐ ఆసుపత్రిలో అస్తవ్యస్త పాలన కొనసాగుతుంది.

ప్రభుత్వ ఉద్యోగులు కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన ఈ ఆసుపత్రిలో అధికారులు సిబ్బంది సమయపాలన పాటించకపోవడం…
కనీస వసతులు లేకపోవడం, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు…ప్రభుత్వ ఉద్యోగులు కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన ఈ ఆసుపత్రిలో అధికారులు సిబ్బంది సమయపాలన పాటించకపోవడం…
కనీస వసతులు లేకపోవడం, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు…
ఈఎస్ఐ ఆసుపత్రిలో రోగుల ప్రధాన సమస్య సమయపాలన లేని అధికారులు ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సిన ఓపి సేవలు ఆలస్యంగా మొదలవుతున్నాయి, వైద్యులు ఇతర సిబ్బంది 10:30 తర్వాత కూడా వీధులకు రావడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు… దీనివలన ఉదయం నుండి క్యూలో నిరీక్షిస్తున్న రోగులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది.
ఆస్పత్రిలో పనిచేస్తున్న సిబ్బంది కూడా తమకు ఇష్టం వచ్చినట్లుగా, విధులను నిర్వహిస్తున్నారు..
రోగులకు సరైన సమాచారం ఇవ్వడం లేదని ఫిర్యాదులు వ్యక్తం అవుతున్నాయి…
ఇక వసతుల విషయానికి వస్తే….
ఆస్పత్రిలో కనీస వసతులు కూడా సరిగా లేవని, ఆసుపత్రికి వచ్చే రోగుల కోసం త్రాగునీరు, మరుగుదొడ్లు, వంటి ప్రాథమిక సదుపాయాలు సరిగా లేవని రోగులు చెబుతున్నారు… ఆసుపత్రి భవనం కూడా పాతబడిపోయిందని,
సరైన నిర్వహణ లేక అపరిశుభ్రంగా ఉందని రోగులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు…
ఈఎస్ఐ హాస్పిటల్ లో కొనసాగుతున్న నిర్లక్ష్యం పై ఉన్నత అధికారులు దృష్టి తరించలేకపోవడం, ఆందోళనకు గురి చేస్తుంది.
రోగుల ఫిర్యాదులు అందుకున్నప్పటికీ, తక్షణ చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని, ఆస్పత్రి ఉన్నత అధికారులు ఈ విషయంపై వివరణ కూడా సరైన సమాధానం ఇవ్వలేదు అని తెలుస్తుంది.. కార్మికులు ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు ఈ ఆసుపత్రి చాలా ముఖ్యమైనటువంటిది ఆసుపత్రిలో నిర్లక్ష్యం కొనసాగితే వారి ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం పడుతుంది… ఈఎస్ఐ ఆసుపత్రిలో పరిస్థితులను మెరుగుపరచడానికి ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని రోగులు కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి..
వైద్యులు సిబ్బంది సమయపాలన పాటించేలా చూడాలని కనీస వసతులు కల్పించాలని ఆస్పత్రిని ఆదుకరించాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు…
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....












