– బాన్సువాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్
నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా : నసురుల్లాబాద్ మండలంలోని బొప్పాస్ పల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త శివరాం గత కొద్ది రోజుల క్రితం గుండెపోటుకు గురై మరణించాడు. విషయాన్ని తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు,బాన్సువాడ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ బుధవారం రోజు స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి మృతి చెందిన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యాన్ని అందించారు.భవిష్యత్తులో ఆ కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు గొడిసెల నర్సింలు గౌడ్, టేకుర్ల సాయిలు, కార్యకర్తలు గంపల శంకర్, లక్ష్మణ్ ,అల్లం రాములు ,మోసీన్, డి.సాయిలు, బద్రి, దొంతి భాస్కర్, రాజు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








