Post Views: 293
బోధన్ పట్టణంలోని ప్రధాన రహదారులకు ఇరు వైపులా ఉన్న హోటల్స్, దుకాణ సముదాయాలు, మెడికల్ హాల్స్ తదితర వ్యాపార స్థావరాల యజమానులకు ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు.
వీరి వ్యాపారాలకు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ బోర్డులు, ఇతర వస్తువులు ప్రజలకి లేదా వాహనాల ట్రాఫిక్‌కి అంతరాయం కలిగించే విధంగా ఉండకూడదని స్పష్టం చేశారు. పాదచారుల ప్రయాణానికి ఆటంకం కలిగించేలా ఫుట్‌పాత్‌పై వ్యాపారం చేయడం, బోర్డులు పెట్టడం, అక్రమ పార్కింగ్ వంటి చర్యలపై Section 39(b) మరియు Section 41(1) CP Act ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు.
ట్రాఫిక్ పోలీసులు ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ చర్యలు తీసుకుంటున్నామని, వ్యాపారులు అందరూ సహకరించాలని బోధన్ ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్ తెలిపారు.
ప్రమాదాలను నివారించడంలో భాగంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించడమేకాక, ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలన్నారు. నగర వ్యాపారవర్గం ఈ సూచనలపై సహకరించకపోతే కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....










