V1News Telangana

best news portal development company in india

🚩రేపు శ్రావణ సోమవారం , శ్రావణ సోమవార వ్రతాన్ని ఎలా పాటించాలి ?🚩 🕉🕉🕉🕉🕉🕉🕉🕉

SHARE:

శ్రావణ సోమవార వ్రతంలో ఆదిదంపతులైన శివపార్వతులను పూజిస్తారు. పురాణాలననుసరించి సోమవారపు వ్రతాలు మూడు రకాలుగా ఉన్నాయి.

సోమవారం , పదహారు సోమవారాలు , సౌమ్య ప్రదోష్. అన్ని వ్రతాలలాగే ఈ సోమవారపు వ్రతం పాటించాలి. శ్రావణమాసంలో ఈ సోమవారపు వ్రతాన్ని పాటిస్తే చాలా శుభాలు కలుగుతాయని పురాణాలు చెపుతున్నాయి.

శ్రావణ సోమవారపు వ్రతాన్ని సూర్యోదయానికి ముందు ప్రారంభించి సాయంత్రం వరకు పాటిస్తుంటారు. శివుని పూజ చేసిన తర్వాత సోమవారపు కథను వినడం తప్పనిసరి. వ్రతాన్ని పాటించేవారు రోజుకు ఒకపూట మాత్రమే భోజనం చేయాల్సి ఉంటుంది.

శ్రావణ సోమవారపు వ్రతాన్ని పాటించే వారు బ్రహ్మ ముహూర్తంలో నిద్రనుపక్రమించి స్నానపానాదులు పూర్తి చేసుకోవాలి. ఇంటిని పరిశుభ్రంగా చేసుకుని గంగాజలాన్ని లేదా పవిత్రమైన నీటిని ఇంట్లో చల్లాలి. ఇంట్లోనే మీకు నచ్చిన చోట లేదా పూజగదిలో శివుని విగ్రహాన్ని ఏర్పాటు చేయండి లేదా పటాన్ని ఏర్పాటు చేసుకోండి.

పూజాదికార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఈ మంత్రం పఠిస్తూ సంకల్పం చేసుకోండి.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india