V1News Telangana

best news portal development company in india

పార్టీలకు అతీతంగా పేదల బాగోగులకు కృషి చేస్తాం: అభివృద్ధికి అడ్డు వస్తే ఊరుకోం: ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్..

SHARE:

. ఎన్నికలకే రాజకీయాలు – అభివృద్ధిలో ఒక్కటిగా ముందుకు పోదాంఇందిరమ్మ ఇండ్లకు అర్హులందరికీ మంజూరు – సిరాలలో శంకుస్థాపన.

. పార్టీలకు అతీతంగా పేదల బాగోగులకు కృషి చేస్తాం: రామారావు పటేల్
. ఎన్నికలకే రాజకీయాలు – అభివృద్ధిలో ఒక్కటిగా ముందుకు పోదాం..

    Oplus_16777216
నిర్మల్ జిల్లా బైంసా మండలం.సిరాల గ్రామం, జూలై 25:అభివృద్ధి విషయంలో ఎవరు ఆటంకం కలిగించినా ఊరుకునే ప్రసక్తే లేదని బోధన్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ తీవ్ర హెచ్చరికలు చేశారు. సిరాల గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, అర్హులందరికీ ఇండ్లు మంజూరు చేస్తామని, ఇంకా దరఖాస్తు చేయని వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.”పేదలకు అన్యాయం జరిగితే తట్టుకోం. అభివృద్ధి పనుల్లో అడ్డంకులు కలిగించడాన్ని సహించం” అని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో రాజకీయాలు చేయవచ్చుగానీ, అభివృద్ధిలో పార్టీలు, విభేదాలు మరిచి కట్టుబాటు అవసరమన్నారు.‎ఈ సందర్భంగా గ్రామస్థుల నుండి పలు విజ్ఞప్తులు స్వీకరించిన ఎమ్మెల్యే, గ్రామ అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులుతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు
V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india