Post Views: 125
వీ1న్యూస్,బోధన్,నిజామాబాద్ జిల్లా:జూలై 26 కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా బోధన్ పట్టణంలో భారతీయ విద్యార్థి సేన ఆధ్వర్యంలో అమరవీరులకు ఘన నివాళులు అర్పించేందుకు ర్యాలీ నిర్వహించబడింది. ఈ ర్యాలీ కొత్త బస్టాండ్ నుండి ప్రారంభమై అంబేద్కర్ చౌరస్తా మీదుగా ఓల్డ్ బస్టాండ్ పెద్ద హనుమాన్ మందిర్ వరకు సాగింది. అనంతరం యు టర్న్ తీసుకొని తిరిగి అంబేద్కర్ చౌరస్తాలో నివాళుల కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా భారతీయ విద్యార్థి సేన బోధన్ పట్టణ అధ్యక్షుడు కస్పా లింగం మాట్లాడుతూ, “కార్గిల్ యుద్ధంలో భారతదేశం విజయం సాధించిన జూలై 26వ తేదీని ప్రతి సంవత్సరం విజయ దినంగా జరుపుకుంటాం. దేశ సైనికుల ధైర్యసాహసాలు, వ్యూహాత్మక నైపుణ్యం కార్గిల్ విజయంలో కీలక పాత్ర పోషించాయి,” అని తెలిపారు.
పాకిస్తాన్ ఆక్రమించిన భూభాగాన్ని తిరిగి సాధించేందుకు భారత దళాలు ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన సాహసం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందన్నారు. దేశానికి సేవచేసిన అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడమే ఈ దినోత్సవం ఉద్దేశమని లింగం పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేవైఎం అధ్యక్షుడు ఎనిగంటి గౌతమ్ గౌడ్, బిల్లా విజయ్, సాగర్ గౌడ్, శివ, కళ్యాణ్, ఆకాష్, అరుణ్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....









