– స్థానిక సంస్థల ఎన్నికలలో విజయం సాధించే విధంగా సైనికుల్లా పనిచేయాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం
– ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా సంసిద్ధంగా ఉండాలని పలు సూచనలు
– గ్రామాలలో కాషాయ జెండా రెపరెపలాడే విధంగా కృషి చేస్తామని ప్రతిజ్ఞ
– బిజెపి రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ
రుద్రూర్ ప్రతినిధి:
నిజామాబాద్ జిల్లా: బాన్సువాడ నియోజకవర్గం లోని రుద్రూర్ మండల కేంద్రంలో గల బీజేపీ పార్టీ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధిష్టానం పిలుపుమేరకు బుధవారం రోజు బిజెపి మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల వర్క్ షాప్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రుద్రూర్ మండల ప్రభారి , కామారెడ్డి జిల్లా కౌన్సిల్ మెంబర్ తృప్తి శివప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో త్వరలో నిర్వహించబోయే స్థానిక సంస్థల ఎన్నికలు సర్పంచ్, ఎంపిటిసి, జెడ్పిటిసి, ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని క్షేత్రస్థాయిలో కార్యకర్తలందరూ సంసిద్ధంగా ఉండాలని దిశా నిర్దేశం చేశారు.మండల పరిధిలోని10 గ్రామ పంచాయితీలు,6 ఎంపీటీసీ స్థానాలు మరియు ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలను భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకునే విధంగా.. ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా విజయం సాధించే విధంగా కార్యకర్తలు అందరూ సైనికుల్లా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధానకార్యదర్శి ఏముల గజేందర్, వడ్ల సాయినాథ్ కోశాధికారి కటిక రామ్ రాజు,మండల సీనియర్ నాయకులు పార్వతి మురళి, మహిపాల్ గుప్త, ఉపాధ్యక్షులు రేపల్లి సాయిప్రసాద్, వినోద్ కుమార్, కృష్ణం రాజు, జీలకర్ర విజయ్, బోజిగొండ అనిల్,ఓబీసీ మండల అధ్యక్షులు ఓదెల సతీష్ పవార్,యువ మోర్చా అధ్యక్షులు కుమ్మరి గణేష్, sc మోర్చా మండల అధ్యక్షులు శివప్రసాద్,మండల కార్యదర్శి అంకెరాజేష్,మహేందర్, నెమ్లి గంగాధర్, శ్రీనివాస్, కుర్లెపు గంగాధర్,శంకర్, సుబ్బారావ్, ధమ్మా సాయికుమార్, కన్నె శ్రీనివాస్,మండల సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








