V1News Telangana

best news portal development company in india

బంజారాల తీజ్ పండుగ వేడుకల్లో పాల్గొన్న బిజెపి నాయకులు….

SHARE:

– భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించిన బంజారాలు

– ప్రత్యేక ఆకర్షణగా వివాహం కాని యువతుల వ్రతాలు

– ప్రకృతితో ముడిపడిన పండుగగా అభి వర్ణన

– బిజెపి కామారెడ్డి జిల్లా కౌన్సిల్ మెంబర్ సున్నం సాయిలు

నసురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ నియోజకవర్గం నసురుల్లాబాద్ మండలంలోని సంగం తండాలో మంగళవారం రోజు తీజ్ పండగ సందర్భంగా నాయక్ కారోబార్ ఫకీరా నాయక్ ఇంటి వద్ద జరిగిన పూజలో భారతీయ జనతా పార్టీ కామారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు పైడిమల్ లక్ష్మీనారాయణ, జిల్లా కౌన్సిల్ మెంబర్ సున్నం సాయిలు కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సున్నం సాయిలు మాట్లాడుతూ బంజారా లు ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా తీజ్ పండుగను జరుపుకోవడం చూడముచ్చటగా ఉంటుందని అన్నారు. బంజారా సోదరులు మరియు సోదరీమణులు నూతన వస్త్రాలను ధరించి భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించుకుని పండుగను జరుపుకుంటారని ముఖ్యంగా వివాహం కానీ యువతులు వారి సాంప్రదాయ నూతన వస్త్రాలను ధరించి తమకు మంచి గుణగణాలు కలిగిన భర్తలతో వివాహం జరగాలని.. వంశవృద్ది మరియు ఆర్థికంగా ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరుకుంటూ ఆచరించే ప్రకృతితో పెనవేసుకున్న గొప్ప పండుగ అని కొనియాడారు. అదేవిధంగా సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు కళకళలాడుతూ.. తండావాసులు అందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖశాంతులతో జీవించాలని వేడుకుంటారని తెలియజేశారు. మహిళలందరూ సంప్రదాయ నృత్యంలో అలరించడం కన్నుల పండుగగా ఉందని అభివర్ణించారు. అనంతరం బంజారా సోదరులతో కలిసి ఆనందంగా వారి సాంప్రదాయ నృత్యంలో పాల్గొన్నారు. అందరూ కలిసి ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో అరిగె నారాయణ, అశోక్ నాయక్, దశరథ్ నాయక్, రమేష్ నాయక్, హోమ్ల నాయక్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india