– పలువురు విద్యార్థులకు ఆదర్శప్రాయమని ప్రశంసల జల్లు
– భవిష్యత్తులో అండగా ఉంటామని భరోసా
– ఉన్నత స్థాయికి ఎదగాలని నిండు మనసుతో దీవించిన నాయకులు
– బిజెపి నాయకులు, NRI కోనేరు శశాంక్
పొతంగల్ ప్రతినిధి:
నిజామాబాద్ జిల్లా: బాన్సువాడ నియోజకవర్గం పొతంగల్ మండలంలోని జల్లాపల్లి ఫారం గ్రామానికి చెందిన ధరావత్ మమత తండ్రి పేరు మీట్య నాయక్ పదవ తరగతి పరీక్ష ఫలితాలలో మండల టాపర్ గా, ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో రాష్ట్రస్థాయిలో 9వ ర్యాంకును, ఇప్పుడు IIT లో సీటు సాధించడం పట్ల పొతంగల్ మండలానికే కాకుండా బాన్సువాడ నియోజకవర్గం లోని విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తుందని ఈ పరిణామం అందరూ గర్వించదగ్గ విషయమని కొనియాడుతూ అభినందించారు. ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ సోమవారం రోజు విద్యార్థి మమతకు రూ.
5,000 ఆర్థిక సహాయం బిజెపి పోతంగల్ మండల సీనియర్ నాయకులు ప్రకాష్ పటేల్ చేతుల మీదుగా అందింపజేశారు. అంతేకాకుండా భవిష్యత్తులో తన ఉన్నత విద్యను అభ్యసించడానికి అవసరమయ్యే సౌకర్యాలను కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కల్పిస్తానని,అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రకాష్ పటేల్ మమతను శాలువాతో ఘనంగా సత్కరించారు. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు రాజు పటేల్, మండల సీనియర్ నాయకులు డి. మక్కయ్య, కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ పటేల్, మండల సీనియర్ నాయకులు సంజీవ్ కుమార్, కిరణ్ గుప్త ,దరావత్ రాజు, బూత్ అధ్యక్షులు సాయినాథ్, రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








