ఇసుక అక్రమ రవాణాకు లైసెన్స్ ఎవరిచ్చారు?
. రోజూ నది నుంచి ఇసుక దోపిడీ… పక్కన చూస్తున్న ప్రభుత్వ యంత్రాంగం!
. మాఫియాకు పర్మిషన్ లేకుండా “ఫుల్ ఓపరేషన్” – ప్రజల ఆగ్రహ జ్వాలలు
. బోధన్ వాసులకు ప్రశ్నలు – అధికారులు మాత్రం మౌనంగా!బోధన్ మండలంలో ఇసుక మాఫియాకు అంతుకు నోచని రాజ్యం – అధికారుల మౌనమే మాఫియాకు బలపరిచే ఆయుధం అవుతోంది.

బోధన్ పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లో ప్రతిరోజూ ట్రాలీ ఆటోల ద్వారా మందర్నా మంజీరా నది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. వీటి పై ఒక్కటి కూడా నంబర్ ప్లేట్ లేదు. వాహన చలకులకు డ్రైవింగ్ లైసెన్సులు లేకుండా, బ్యాచ్ నంబర్లు లేకుండా ఇసుకను డంఫ్ చేస్తూ బయటకు అమ్ముతున్నారు.
విచిత్రమేమిటంటే – దీనిని నిత్యం వీధుల్లో చూసే ప్రజలు గట్టి ప్రశ్నలు వేస్తుంటే… సంబంధిత శాఖలు – పౌరసరఫరాలు, మైనింగ్, పోలీస్ శాఖలు మాత్రం కనీస స్పందన ఇవ్వడంలేదు.
“ఏమైనా యాక్సిడెంట్ జరిగితే బాధ్యత ఎవరిది?” అని ప్రజలు వేదనతో అడుగుతున్నారు. నిబంధనలు లేని వాహనాలు జన బహుళ మార్గాల్లో వేగంగా వెళ్తుంటే ప్రాణ నష్టం జరగదా? ఎవరి ముద్రలతో వీటికి గ్రీన్ సిగ్నల్ వస్తోంది?
అభివృద్ధి పనుల పేరిట తీసుకుంటున్న ఇసుకను భారీ ధరలకు విక్రయిస్తుండగా… అధికారుల మౌనం అర్థం కాని విషయంగా మారింది. కొంతమంది మామూలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజలు డిమాండ్ చేస్తున్నది ఒక్కటే – ఇప్పటికైనా అక్రమ ఇసుక రవాణాపై చర్యలు తీసుకోవాలి. నంబర్ ప్లేట్ లేకుండా, అనుమతులు లేకుండా నడుస్తున్న ట్రాలీ ఆటోలను జప్తు చేయాలి. దీనివల్ల సురక్షిత మార్గాలు, చట్టానికి గౌరవం తిరిగి రావాలి..
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








