V1News Telangana

best news portal development company in india

కబ్జాలు చేస్తాం… మేమే శాసనం!”? సాలురలో కాలువలు గల్లంతు – కబ్జాదారుల రాజ్యం.? నోటీసులు లెక్కచేయని కబ్జాదారులు – అధికారులకి బెదిరింపులు? రైతు పాలన ఎక్కడ? కబ్జాల పాలన సాగుతోంది!?? ఎమ్మెల్యే పేరు వాడుకొని ప్రజల్లో భయం పెంచుతున్న కబ్జాదారులు!?

SHARE:

వి1 న్యూస్, నిజామాబాద్ జిల్లా – సాలుర మండలం.పంటల కోసం  కాలువలు కాదు, కబ్జాదారుల భూములుగా మారిపోయాయి! సాలుర మండలంలోని పంట కాలువలపై జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై అధికారులు పరమౌనవ్రతం పాటిస్తున్నారు. కొన్ని చోట్ల నోటీసులు ఇచ్చి చేతులు దులుపుతున్న అధికారులు, పలువురిపై మాత్రం కన్నెత్తి చూడకపోవడం విచారకరం.
“పార్టీ కోసం కష్టపడ్డాం… కబ్జాలు చేస్తాం” అనే డైలాగులు ఇప్పుడు ఈ మండలంలో నిత్యకృత్యంగా మారిపోయాయి. నోటీసులు తీసే స్థితిలో లేని కబ్జాదారులు, ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నారు. అధికారులను బెదిరించడమే కాదు, “మేమే రాజులం – మేమే శాసనం” అంటూ పెదవి విరుస్తున్నారు.

రైతుల కాలువలు ఎక్కడ ఉన్నాయి అనే ప్రశ్నకు అధికారులు సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారు. ప్రభుత్వం నిధులతో రైతులకు కల్పించే పథకాలను అడ్డుకునే ధైర్యం చూపుతున్న ఈ అక్రమార్కులు, స్థానిక ప్రజాప్రతినిధుల పైనే చెడ్డ పేరు తీసుకువస్తున్నారు.

oplus_8388608
ఎమ్మెల్యే పేరు వాడుకుంటూ, అధికారులను ఒత్తిడి చేసి, రైతుల నడి నదిని గుల్ల చేసి అక్రమంగా నిర్మాణాలు వేసుకుంటున్నారు. ఇంతటి ఘనమైన సమస్యపై ఎమ్మెల్యే గారు ఎందుకు మౌనంగా ఉన్నారు? రైతులు ప్రశ్నిస్తున్నారు: “ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా రైతు పాలన?”

 

ఇకనైనా అధికారులు, ప్రజాప్రతినిధులు మేలుకోకపోతే, పంటకే గండి, ప్రజాస్వామ్యానికే ముప్పు తథ్యం….

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india