V1News Telangana

best news portal development company in india

డీఎస్పీని ఘనంగా సత్కరించిన బిజెపి నాయకులు….

SHARE:

– శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని వినతి

– సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రత్యేక చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి

– ప్రజల సమస్యల పట్ల పోలీసులు సమన్వయంతో స్నేహపూర్వకంగా మెదలాలి

– పార్టీ తరపున ఎల్లవేళలా సహకరిస్తామని స్పష్ఠీకరణ

– బిజెపి కామారెడ్డి జిల్లా కౌన్సిల్ మెంబర్ సున్నం సాయిలు

బాన్సువాడ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ పట్టణంలో డిఎస్పి విట్టల్ రెడ్డి ని గురువారం రోజు భారతీయ జనతా పార్టీ కామారెడ్డి జిల్లా కౌన్సిల్ మెంబర్ సున్నం సాయిలు మరియు కార్యకర్తలు అందరూ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందించి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సున్నం సాయిలు మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి.. ప్రజల సమస్యల పట్ల క్రింది స్థాయి సిబ్బంది సమన్వయంతో, స్నేహపూర్వకంగా మెదులుతూ పరిష్కరించాలని విన్నవించారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో నేరాలను ఘోరాలను నియంత్రించడానికి సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రత్యేక చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ తరఫున ఎల్లవేళలా సహకరిస్తామని స్పష్ఠీకరణ చేశారు. ఈ కార్యక్రమంలో నసురుల్లాబాద్ మండల సీనియర్ నాయకులు అనుసూరి శ్రీనివాస్, పెర్క రాములు,అరిగె నారాయణ, గొడిసెల యాదగిరి గౌడ్,అనిల్ గుప్త, కంది పెద్ద మల్లేష్, మనూర్ సాయిలు, ఉల్లెంగ గోపి, ఉల్లెంగ పర్వయ్య, కొప్పుల సాయిలు, బ్యాగరి సాయిలు, ఉల్లెంగ కిష్టయ్య, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india