హైదరాబాద్, జూలై 16 (V1 న్యూస్):తెలంగాణ రాష్ట్ర మహిళల అభివృద్ధి కోసం మరో మెజర్ డెవలప్‌మెంట్ తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమైంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో భాగంగా, తాజాగా “మహాలక్ష్మి పథకం”ను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ఈ పథకం కింద 18 నుండి 55 ఏళ్ల మధ్య వయస్సు గల తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలకు నెలకు రూ. 2,500 నగదు రూపంలో ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ డబ్బును లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా జమ చేయనున్నారు.
ఇప్పటికే పథకం అమలుకు సంబంధించి అధికారులు సెర్ప్, మెప్మా వంటి సంస్థల సహకారంతో మహిళల వివరాలను సేకరించే ప్రక్రియ ప్రారంభించారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి ముందే ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు జరుపుతున్నది.
రాష్ట్రంలో ఇప్పటికే ఉచిత ఆర్టీసీ ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 500లకే గ్యాస్ సిలిండర్ వంటి హామీలు అమలులో ఉన్నాయి. ఇప్పుడు మహాలక్ష్మి పథకం కూడా ఆ కోవలో చేరనుంది.
ఈ పథకం మహిళలకు ఆర్థిక భద్రత కల్పించడమే కాకుండా, కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల్లో మరింత మద్దతును కలిగించేలా ఉండనున్నదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఈ పథకం ప్రారంభ తేదీకి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. మహిళలు తమ ఆధార్, రేషన్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు సిద్ధంగా ఉంచుకోవాలని అధికార వర్గాలు సూచిస్తున్నాయి.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








