V1News Telangana

best news portal development company in india

మహిళా శక్తికి కొత్త వెలుగు – రేవంత్ పాలనలో మహిళల శ్రేయస్సే లక్ష్యంగా అడుగులు: బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి…

SHARE:

ఎడపల్లి, బోధన్ మండలం – జూలై 16:

తెలంగాణలో గత పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో మహిళలు ఎన్నో సమస్యలతో బాధపడినప్పటికీ, ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి పాలనలో మహిళలకు పెద్దపీట వేస్తూ వారిని ఆర్థికంగా, సామాజికంగా స్థిరంగా నిలబెట్టే దిశగా అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని బోధన్ ఎమ్మెల్యే శ్రీ పొల్లి సుదర్శన్ రెడ్డి తెలిపారు.

బుధవారం ఎడపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి “మహిళా శక్తి సంబరాలు” కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన మాట్లాడుతూ, “మహిళా సంఘాలకు ప్రభుత్వ విద్యార్థుల యూనిఫామ్ కుట్టడం, ఆర్టీసీ అద్దె బస్సులు, సూపర్ మార్కెట్లు, సోలార్ విద్యుత్ ప్లాంట్లు వంటి పథకాల ద్వారా మహిళల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే ప్రయత్నం జరుగుతోంది. ఇవి రేవంత్ సర్కార్ మహిళల సాధికారతకు ఇచ్చే ప్రాధాన్యతను ప్రతిబింబిస్తున్నాయి,” అని పేర్కొన్నారు.

వడ్డీలేని రుణాల వల్ల ప్రభుత్వం పలు ఆర్థిక భారాలు భరించాల్సి వచ్చినా, మహిళల సంక్షేమంలో ఎటువంటి రాజీ లేకుండా ముందుకు సాగుతున్నామని, ఎలాంటి అడ్డంకులు వచ్చినా అధిగమిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. నియోజకవర్గ స్థాయిలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అంకిత్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ ప్రతినిధి తాహర్ బీన్ హంధాన్, కాంగ్రెస్ నాయకులు నగేష్ రెడ్డి, గడుగు గంగాధర్, పులి శ్రీనివాసరావు, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ రజిత యాదవ్, మహిళా సంఘాల అధ్యక్షులు, డ్వాక్రా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

> సంక్షిప్తంగా: మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి బోధన్ నియోజకవర్గం పటిష్టమైన కేంద్రంగా మారుతుందని ఎమ్మెల్యే సందేశం స్పష్టం చేసింది.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....