V1News Telangana

best news portal development company in india

విద్యార్థుల చదువుకు అడ్డుగా స్కాలర్‌షిప్ బకాయిలు.. పెండింగ్‌ స్కాలర్‌షిప్‌ బకాయిలపై తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆందోళన.. విద్యార్థులకు న్యాయం చేయండి – టీఎస్‌వీపి నేతల డిమాండ్..

SHARE:

 స్కాలర్‌షిప్ బకాయిలకు వెంటనే నిధులు విడుదల చేయాలి: టీఎస్‌వీపి హెచ్చరిక..

. ఫీజులు కట్టలేక చదువులు మానేస్తున్న విద్యార్థులు – ప్రభుత్వంపై టీఎస్‌వీపి ఆగ్రహం..

బోధన్‌లో టీఎస్‌వీపి విద్యార్థుల నిరసన చర్చనీయాంశం..

. వెంటనే స్పందించకపోతే రాస్తారోకోలు, ధర్నాలు – టీఎస్‌వీపి హెచ్చరిక…విద్యార్థుల చదువుకు అడ్డుగా స్కాలర్‌షిప్ బకాయిలు..
పెండింగ్‌ స్కాలర్‌షిప్‌ బకాయిలపై తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆందోళన..
విద్యార్థులకు న్యాయం చేయండి – టీఎస్‌వీపి నేతల డిమాండ్..
. స్కాలర్‌షిప్ బకాయిలకు వెంటనే నిధులు విడుదల చేయాలి: టీఎస్‌వీపి హెచ్చరిక..
. ఫీజులు కట్టలేక చదువులు మానేస్తున్న విద్యార్థులు – ప్రభుత్వంపై టీఎస్‌వీపి ఆగ్రహం..
బోధన్‌లో టీఎస్‌వీపి విద్యార్థుల నిరసన చర్చనీయాంశం..
. వెంటనే స్పందించకపోతే రాస్తారోకోలు, ధర్నాలు – టీఎస్‌వీపి హెచ్చరిక…

విద్యార్థులకు న్యాయం చేయాలి – స్కాలర్‌షిప్ బకాయిల విడుదలపై బోధన్ సబ్ కలెక్టర్‌కు టీఎస్‌వీపి మెమొరాండం

బోధన్, జూలై 16 (V1 న్యూస్):తెలంగాణ విద్యార్థి పరిషత్ (టీఎస్‌వీపి) ఆధ్వర్యంలో ఈరోజు బోధన్ సబ్ కలెక్టర్‌కు ఒక కీలక మెమొరాండం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా టీఎస్‌వీపి బోధన్ డివిజన్ అధ్యక్షుడు మీసాలే నాగేష్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

“విద్యార్థులు చదువు కొనసాగించలేని పరిస్థితి ఏర్పడింది. కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వకపోవటంతో విద్యార్థులు ఫీజులు కట్టలేక చదువును మానేస్తున్నారు. తల్లి తండ్రులు అప్పులు చేసి చదివించగా, స్కాలర్‌షిప్ బకాయిలు రాకపోవడం వల్ల విద్యార్థులు భవిష్యత్తు బలయ్యే ప్రమాదం ఉంది” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

నాగేష్ పేర్కొన్నది ప్రకారం, ప్రభుత్వం స్పందించకపోతే బోధన్ డివిజన్ అంతటా మండల స్థాయిలో రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించాల్సి వస్తుందని హెచ్చరించారు 

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india