V1News Telangana

best news portal development company in india

ఆల్ఫోర్స్ పాఠశాలలో బోనాల సందడి – మెహేంది ఉత్సవంతో విద్యార్థుల ఉత్సాహం

SHARE:

నిర్మల్, బైంసా, జూలై 15:బైంసా పట్టణంలోని ఆల్ఫోర్స్ పాఠశాలలో బోనాల పండుగ సందర్భంగా సోమవారం మెహేంది ఉత్సవాన్ని అత్యంత హర్షోత్సాహాలతో నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో కళలతో కళకళలాడుతూ పాఠశాల ఆవరణను పండుగ వాతావరణంగా మార్చారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వి. నరేందర్ రెడ్డి అమ్మవారికి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బోనాలు సమర్పిస్తూ పాఠశాల ఆవరణం సాంస్కృతిక మహోత్సవంలా మారింది.

విద్యార్థులు డోలు వాయిద్యాలతో పోతూరాజుల నాట్య విన్యాసాలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, “తెలంగాణ పండుగలు మన సంస్కృతి, సనాతన ధర్మాలకు ప్రతీక. పాఠశాలల్లో ఇలాంటి ఉత్సవాలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో సాంప్రదాయాలపై అవగాహన పెరుగుతుంది,” అని చెప్పారు.

ఆషాఢ మాసం సందర్భంగా నిర్వహించిన మెహేంది కార్యక్రమంలో పలు విద్యార్థులు పాల్గొని మెహేందీ ప్రాముఖ్యతను వివరించారు. శరీరానికి చల్లదనం కలిగించడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచే గుణం మెహేందీలో ఉందని చెప్పారు.

ఈ సందర్భంగా పాఠశాల తేజస్, సరస్, ధ్రువ, లక్ష్య విభాగాలకు కెప్టెన్లు, వైస్ కెప్టెన్లను ఎన్నుకున్నారు. విజేతలైన విద్యార్థులకు చైర్మన్ డాక్టర్ వి. నరేందర్ రెడ్డి ప్రశంసాపత్రాలు అందజేశారు. “ఇలాంటి ఎన్నికల ద్వారా నాయకత్వ లక్షణాలు, ప్రజాస్వామ్య అవగాహన విద్యార్థుల్లో పెరుగుతుంది,” అని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఆల్ఫోర్స్ పాఠశాలలో బోనాల సందడి – మెహేంది ఉత్సవంతో విద్యార్థుల ఉత్సాహం

నిర్మల్, బైంసా, జూలై 15:
బైంసా పట్టణంలోని ఆల్ఫోర్స్ పాఠశాలలో బోనాల పండుగ సందర్భంగా సోమవారం మెహేంది ఉత్సవాన్ని అత్యంత హర్షోత్సాహాలతో నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో కళలతో కళకళలాడుతూ పాఠశాల ఆవరణను పండుగ వాతావరణంగా మార్చారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వి. నరేందర్ రెడ్డి అమ్మవారికి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బోనాలు సమర్పిస్తూ పాఠశాల ఆవరణం సాంస్కృతిక మహోత్సవంలా మారింది.

విద్యార్థులు డోలు వాయిద్యాలతో పోతూరాజుల నాట్య విన్యాసాలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, “తెలంగాణ పండుగలు మన సంస్కృతి, సనాతన ధర్మాలకు ప్రతీక. పాఠశాలల్లో ఇలాంటి ఉత్సవాలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో సాంప్రదాయాలపై అవగాహన పెరుగుతుంది,” అని చెప్పారు.

ఆషాఢ మాసం సందర్భంగా నిర్వహించిన మెహేంది కార్యక్రమంలో పలు విద్యార్థులు పాల్గొని మెహేందీ ప్రాముఖ్యతను వివరించారు. శరీరానికి చల్లదనం కలిగించడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచే గుణం మెహేందీలో ఉందని చెప్పారు.
ఈ సందర్భంగా పాఠశాల తేజస్, సరస్, ధ్రువ, లక్ష్య విభాగాలకు కెప్టెన్లు, వైస్ కెప్టెన్లను ఎన్నుకున్నారు. విజేతలైన విద్యార్థులకు చైర్మన్ డాక్టర్ వి. నరేందర్ రెడ్డి ప్రశంసాపత్రాలు అందజేశారు. “ఇలాంటి ఎన్నికల ద్వారా నాయకత్వ లక్షణాలు, ప్రజాస్వామ్య అవగాహన విద్యార్థుల్లో పెరుగుతుంది,” అని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....