v1 న్యూస్.నిజామాబాద్, జూలై 14:-జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి ఒక శక్తివంతమైన వేదికగా నిలుస్తున్న ప్రజావాణి కార్యక్రమం మరోసారి ఫలప్రదంగా సాగింది. ఈ రోజు పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పోలీస్ కమీషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్., గారు నేరుగా ప్రజల ఫిర్యాదులను స్వీకరించారు.
ఈ సందర్భంగా మొత్తం 26 ఫిర్యాదులను స్వీకరించిన ఆయన, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకున్నారు. సంబంధిత పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు, సీఐలతో నేరుగా మాట్లాడి సమస్యల పరిస్థితిని తెలుసుకొని, పరిష్కార సూచనలు అందించారు.పోలీస్ సేవలు ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ధ్యేయంతో, ప్రజలు మూడో వ్యక్తుల హస్తక్షేపం లేకుండా నేరుగా తమ సమస్యలను చెప్పుకోగల వాతావరణం సృష్టించేందుకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామని కమీషనర్ తెలిపారు. “ప్రతి సోమవారం ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించి, వాటికి చట్టబద్ధమైన పరిష్కారాలు అందించేందుకు పోలీస్ శాఖ కృషి చేస్తోంది,” అని ఆయన వివరించారు.
అనంతరం, ప్రజలతో మరింత సన్నిహితంగా పనిచేసేలా, శాంతి భద్రతలను పరిరక్షించేలా పోలీస్ శాఖ ముందుకు సాగుతోందని ఆయన స్పష్టం చేశారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








