పటిష్ట బందోబస్తు ఏర్పాటు – పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య..
శోభాయాత్ర రూట్ పై పరిశీలనలో పోలీస్ ఉన్నతాధికారులు..
. ఊర పండగకు ముందస్తు ఏర్పాట్లు పూర్తి – పోలీస్ కమిషనర్ తనిఖీ…
వి1 న్యూస్, నిజామాబాద్:-
తేదీ: 12-07-2025 నిజామాబాద్ పట్టణంలో జూలై 13న నిర్వహించనున్న ఊర పండగ శోభాయాత్రకు సంబంధించి రూట్ మ్యాప్‌ను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్ గారు స్వయంగా పర్యవేక్షించారు.
ఈ కార్యక్రమం రఘునాథ ఆలయం (ఖిల్లా చౌరస్తా) వద్ద ప్రారంభమై, వివేకానంద చౌరస్తా, లక్ష్మీ మెడికల్, గాజుల్పేట్, పెద్ద బజార్, గోల్ హనుమాన్, పూలాంగ్ చౌరస్తా, వినాయక్ నగర్, ఆర్యా నగర్, దుబ్బ తదితర ప్రాంతాల వరకూ పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ, శోభాయాత్ర సజావుగా కొనసాగేందుకు పటిష్ట బందోబస్తు, నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని సూచించారు.
ఈ పర్యటనలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, టౌన్ సీఐ శ్రీనివాసరాజ్, పండుగ నిర్వహణకు సంబంధిత సభ్యులు రామ్మర్తి గంగారాం, గాండ్ల లింగం, రాజేందర్ ధుoపేట, విజయ గజ్బింకర్ తదితరులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








