Post Views: 255
బోధన్, జూలై 9:సీపీ గారి ఆదేశాల మేరకు బోధన్ టౌన్ పరిధిలోని శక్కర్ నగర్ ప్రాంతంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఏసీపీ బోధన్ గారి నేతృత్వంలో స్థానిక పోలీస్ విభాగం చేపట్టింది.
ఈ సందర్భంగా ప్రాంతంలో కొత్తగా ఉన్న అనుమానాస్పద వ్యక్తుల వివరాలను సేకరించడంతో పాటు, వాహనాల తనిఖీలు నిర్వహించారు. మొత్తం 52 వాహనాలు స్వాధీనం చేసుకోగా, అందులో 47 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఈ తనిఖీల్లో బోధన్ పోలీస్ స్టేషన్..సిఐలు వెంకట నారాయణ,కృష్ణ,విజయ్ బాబు,ఎస్సైలు పాల్గొన్నారు. ప్రజల భద్రత మరియు శాంతిభద్రతల పరిరక్షణకు ఈ చర్యలు కొనసాగుతాయని పోలీసులు వెల్లడించారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








