కోటగిరి ప్రతినిధి:
నిజామాబాద్ జిల్లా : బాన్సువాడ నియోజకవర్గంలోని కోటగిరి మండలం, ఎత్తొండ గ్రామానికి చెందిన బిజెపి నాయకులు, NRI కోనేరు శశాంక్ నిరుపేద ప్రజలకు మరియు పార్టీ కార్యకర్తలకు “కోనేరు చారిటబుల్ ట్రస్ట్”ద్వారా వివిధ రూపాలలో ఆర్థిక సహకారాలు అందిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. నియోజకవర్గంలోని నిరుపేద కుటుంబంలోని ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి ఎదగాలని గొప్ప సంకల్పంతో, సేవాభావంతో విద్యార్థులకు ఉచితంగా వారికి కనీస సౌకర్యాలు నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిల్లు, లంచ్ బాక్స్ లు, స్కూలు బ్యాగులు ఇతరత్రా సౌకర్యాలు కల్పిస్తూ మానవతా దృక్పథాన్ని చాటుతున్నారు. ఇందులో భాగంగా బుధవారం రోజు కోటగిరి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులు లేని నిరుపేద విద్యార్థులు 45 మందికి రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ చేతుల మీదుగా ఉచితంగా స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. దీంతోపాటు ఎత్తొండ గ్రామంలోని ప్రభుత్వ మండల ప్రాథమిక పాఠశాలలో కూడా 45 మంది విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ శ్రీనివాస్ మాట్లాడుతూ బిజెపి నాయకులు, NRI కోనేరు శశాంక్ అభ్యుదయ భావాలతో, అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆయన దాతృత్వాన్ని చాటుకుంటున్నారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో కోటగిరి ఎంఈఓ మరియు ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ , పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులు రమేష్, ఉపాధ్యాయుల బృందము, బిజెపి కోటగిరి మండల అధ్యక్షులు వేముల నవీన్, పర్యావరణ కమిటీ జిల్లా కోకన్వీనర్ ప్రకాష్ పటేల్, రుద్రూర్ మండల అధ్యక్షులు హరికృష్ణ, ఉపాధ్యక్షులు కృష్ణంరాజు, వెంకటేష్, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి విలాస్, యువ మోర్చా మండల అధ్యక్షులు జగధీష్, శ్యామ్, వెంకటేష్,కార్యకర్తలు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లి దండ్రులు, తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








