V1News Telangana

best news portal development company in india

సార్వత్రిక సమ్మె: బీజేపీ ప్రభుత్వ విధానాలపై మండి పడ్డ కార్మిక సంఘాలు..

SHARE:

బోధన్‌లో ర్యాలీ, బహిరంగ సభ – కేంద్ర కార్మిక సంఘాల పిలుపుతో భారీ నిరసన

“ఇది భవిష్యత్తు ఉద్యమాలకు నాంది” – కార్మిక నాయకుల స్పష్టం.

బోధన్, జూలై 9:సార్వత్రిక సమ్మె నేపథ్యంలో బోధన్ పట్టణంలోని కొత్త బస్టాండ్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టి యు సి ఐ రాష్ట్ర నాయకులు బి.మల్లేష్, సిఐటియు జిల్లా అధ్యక్షులు జే. శంకర్ గౌడ్, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు పుట్ట వరదయ్య, ఏఐటీయుసి నాయకులు చక్రపాణి, దాల్ మల్కా పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.

కార్మిక నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక, ప్రజా, రైతు వర్గాలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని విమర్శించారు. నాలుగు లేబర్ కోడ్ లను అమలు చేయకపోతే పెట్టుబడులు రావని ప్రధాని వ్యాఖ్యలు దురదృష్టకరమని వారు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వానికి సంప్రదింపులపై విశ్వాసం లేదని, ఖాళీలను రిటైర్మెంట్ పోస్టులతో భర్తీ చేస్తూ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాల హామీని విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముఖ్య డిమాండ్లు:

కనీస వేతనం రూ. 26,000గా నిర్ణయించాలి

ఎలాంటి పెన్షన్ లేని కార్మికులకు రూ. 6,000 పెన్షన్ ఇవ్వాలి

ఈపీఎఫ్ పథకం కింద కనీసం రూ. 9,000 పెన్షన్ కల్పించాలి

నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలి

పెట్టుబడులు రాకపోవడానికి కార్మికులు కాదు, కార్పొరేట్ శక్తులకు లొంగిన పాలకులే కారణమని వారు స్పష్టం చేశారు. కార్మిక ప్రజల ఆగ్రహాన్ని పట్టించుకోకపోతే కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటుందని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో టి యు సి ఐ, సిఐటియు, ఐఎఫ్టియు, ఏఐటీయుసి నాయకులతోపాటు బీడీ కార్మికులు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, మధ్యాహ్న భోజన వర్కర్లు, జిపి కార్మికులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india