Post Views: 555
నేడు (జూలై 8) డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆరోగ్యశ్రీ, 108 సేవలు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా ఆయన సామాన్య ప్రజల జీవితాల్లో అమోఘమైన మార్పును తీసుకొచ్చారు. ముఖ్యంగా ఆరోగ్య రంగంలో ప్రవేశపెట్టిన “ఆరోగ్యశ్రీ” దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచింది.
2003లో చేపట్టిన పాదయాత్ర ఆయన ప్రజల మనసు గెలుచుకున్న ఘట్టంగా నిలిచింది. దాని ప్రభావంతో 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆయన సంక్షేమ పాలన, ప్రజా సంకల్పం కారణంగా 2009లో రెండోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. అయితే అదే సంవత్సరం హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన ఆకస్మిక మరణం అందరినీ విషాదంలో ముంచింది.
వైయస్సార్ తన 31 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఓటమిని చూడలేదు. 6 సార్లు ఎమ్మెల్యే, 4 సార్లు ఎంపీగా ప్రజల ఆశీర్వాదం పొందిన ఆయన, నిజమైన ప్రజానాయకుడిగా గుర్తింపు పొందారు. ఈరోజు రాష్ట్రం నలుమూలలలో ఆయన్ని స్మరించుకుంటూ పూలమాలలు అర్పించి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....