కేంద్ర ప్రభుత్వ బడా కార్పోరేట్ అనుకూల విధానాల కు నిరసనగా
జూలై 9 నాటి సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలంటూ
బోధన్ పట్టణంలో కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ
కేంద్రంలోని మోదీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న బడా కార్పొరేట్, బడా పెట్టుబడిదారుల ప్రయోజనాల అనుకూల విధానాలను నిరసిస్తూ జులై 9న జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలంటూ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు పిలుపునివ్వడం జరిగింది. ఆదివారం నాడు బోధను పట్టణంలోని పాన్ గల్లి లోని హెడ్ పోస్ట్ ఆఫీస్ నుండి బైకుల ప్రదర్శన ప్రభుత్వ ఆసుపత్రి, పాత బస్టాండు, అంబేద్కర్ చౌరస్తా మీదుగా, షర్బత్ కెనాల్, కొత్త బస్టాండు, సాత్ పూల్ నుండి శక్కర్ నగర్ చౌరస్తా అక్కడి నుండి రైల్వే గేటు గంజి కమాన్ వరకు అంబేద్కర్ చౌరస్తా వరకు బైకుల ర్యాలీ నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా టి యు సి ఐ రాష్ట్ర నాయకులు బి. మల్లేష్ , సిఐటియు జిల్లా అధ్యక్షుడు జె. శంకర్ గౌడ్, ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు పి. వరదయ్యలు మాట్లాడుతూ గత 11 సంవత్సరాలుగా మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం బడా కార్పొరేట్ కంపెనీలకు ప్రయోజనాలకు అనుకూలమైన విధానాలని అనుసరిస్తూ, దేశంలోని ప్రజా, కార్మికా,రైతాంగానికి నష్టం కలిగించే విధానాలని అనుసరిస్తున్నాడని అందులో భాగంగానే ఎన్నో పోరాటాలను చేసి, మరెన్నో త్యాగాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్ లను తీసుకువచ్చి వాటిని అమలు చేయుటకు పూనుకుంటున్నారని వాటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఢిల్లీలో రైతాంగము సంవత్సరంకు పైగా పోరాడితే వారికి ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని మండిపడ్డారు. అదేవిధంగా కాంట్రాక్ట్ ఔర్సోర్సింగ్ కార్మికులను సరియైన వేతనాలు ఇవ్వడం లేదని, వారిని పర్మినెంట్ చేసే ఉద్యోగ భద్రత కల్పించడం లేదని వీటికి వ్యతిరేకంగా 9 నాడు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జి. సీతారాం, డి. పోశెట్టి,డి.నాగేష్, బి. భూషణ్ గౌడ్, సిహెచ్ నాగయ్య, ప్రభాస్, గంగాధర్, ఎస్.సాయిలు,రాములు, శేఖర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








