V1News Telangana

best news portal development company in india

ఇందిరమ్మ ఇళ్ల పథకం: 6వ వార్డులో సబ్ కలెక్టర్ తనిఖీ…

SHARE:

ఇళ్ల నిర్మాణంపై సబ్ కలెక్టర్ సూటిగా పరిశీలన…

లబ్ధిదారులతో ప్రత్యక్ష సంభాషణ – బోధన్ సబ్ కలెక్టర్…

ఇందిరమ్మ పథకం నిధుల విడుదల విధానం వివరించిన సబ్ కలెక్టర్…. నిర్మాణం పురోగతి – సబ్ కలెక్టర్ ప్రత్యక్షంగా సమీక్ష…

 

బోధన్: ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో భాగంగా బోధన్ సబ్ కలెక్టర్ , నీటి పారుదల శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ తో కలసి 6వ వార్డులో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పథకం కింద మంజూరైన ఇళ్ల నిర్మాణ పురోగతిని సమీక్షించారు.

సబ్ కలెక్టర్. లబ్ధిదారులతో ప్రత్యక్షంగా మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న సవాళ్ళు, నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలు తెలుసుకున్నారు. నిర్మాణ పనులు ఏ దశలో ఉన్నాయో పరిశీలించారు. అలాగే పథకం కింద నిధుల విడుదల ప్రక్రియపై లబ్ధిదారులకు స్పష్టతనిచ్చారు.

“ప్రతి దశ నిర్మాణం పూర్తైన అనంతరం నిధులు విడులవుతాయని, ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి నిధుల విడుదల జరుగుతుందని” సబ్ కలెక్టర్. వివరించారు.

ఈ పర్యటన ద్వారా అధికారుల దృష్టికి కొన్ని సమస్యలు వచ్చినట్టు తెలుస్తోంది. వాటిపై త్వరితగతిన పరిష్కార చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india