V1News Telangana

best news portal development company in india

చక్రేశ్వర శివాలయంలో ప్రదుష సమయంలో శివాభిషేకానికి వినతి.. . శివ భక్తుల కోరికలకు గౌరవం – చైర్మన్, ఈఓ సానుకూల స్పందన…

SHARE:

చక్రేశ్వర శివాలయంలో ప్రదుష సమయంలో శివ అభిషేకం నిర్వహించాలి – భక్తుల వినతి

బోధన్ పట్టణంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీ చక్రేశ్వర శివాలయం లో ప్రదుష కాలంలో శివ అభిషేకం నిర్వహించాలని ఆలయ ఈఓ రాములు మరియు చైర్మన్ హరికాంత్ చారి గారికి వినతిపత్రం అందజేయబడింది.

శివ భక్తుల తరఫున లోకం శ్రీనివాస్, పూర్న సతీష్ లు ఈ వినతిపత్రాన్ని అందజేశారు. దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న అనేక శివాలయాల్లో ప్రదుష సమయంలో శివాభిషేకం నిర్వహించడం జరుగుతోంది. చక్రేశ్వర శివాలయంలోనూ ఈ విధంగా పూజ నిర్వహించాలని భక్తులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు.

ఈ విషయాన్ని ఆలయ అధికారులకు తెలియజేయగా, వారు సానుకూలంగా స్పందించారు. భవిష్యత్తులో భక్తుల ఆధ్యాత్మిక సంతృప్తి కోసం ఈ పూజా కార్యక్రమం ప్రారంభించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆశలు వ్యక్తమవుతున్నాయి.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india