“కల్తీ నూనె మాఫియా రెచ్చిపోయిన – అంతా మోసాల కేంద్రాలే!”
. “పేరుకే ఆయిల్ మిల్లులు – అసలైతే ప్రాణాలతో చెలగాటం!”
. “ప్రభుత్వ పన్నులకు చెక్, ప్రజల ఆరోగ్యానికి శాపం – కల్తీ నూనె దందా!”
“నకిలీ ఆయిల్ మాఫియా : బాధితులే బుద్ధి చెప్తారంటూ హెచ్చరిక!”
“నిజామాబాద్ జిల్లా వాసుల ప్రాణాలతో చెలగాటం – మాఫియా, అధికారుల మౌనం శాపంగా మారిందా?”
నిజామాబాద్ జిల్లా:బోధన్ పట్టణంతో పాటు చుట్టుపక్కల పలు మండలాల్లో కల్తీ నూనె మాఫియా రెచ్చిపోయింది. ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చిన నకిలీ ఆయిల్‌ను స్థానికంగా తక్కువ ధరకు విక్రయిస్తూ, ప్రజల ఆరోగ్యాన్ని తీవ్రమైన ముప్పులోకి నెట్టేస్తున్నారు. కొన్ని పేరుకే ఆయిల్ మిల్లులుగా నమోదు చేసుకుని ఉన్నా, అక్కడ అసలు ఆయిల్ యంత్రాలే లేకుండా ఫేక్ ఆయిల్ తయారీ కొనసాగుతుండటం గమనార్హం.
ఇది కేవలం ప్రజల ఆరోగ్యానికి ముప్పు మాత్రమే కాదు, ప్రభుత్వానికి పన్నుల రూపంలో భారీ నష్టాన్ని కలిగిస్తున్న మోసం కూడా. అయితే, వీరిపై చర్యలు తీసుకోవాల్సిన ఫుడ్ ఇన్స్పెక్టర్లు, సెల్టెక్స్ శాఖ అధికారులు మాత్రం మౌనం పాటించడం, వారు మాఫియాకు తోడుగా మారారన్న అనుమానాలు బలపడుతున్నాయి.
గతంలో ఓ మిల్లర్ యజమాని రైతులను మోసగించిన కేసులు ఉన్నా, ఇప్పటికీ అతను స్వేచ్ఛగా తిరుగుతుండడం కల్తీ దందాలకు అధికారుల అండ ఉందనే భావనకు బలమిస్తుంది. బాధితులు సాక్ష్యాలతో బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అంతేకాదు, నాందేడ్ జిల్లాలోని కృష్ణూర్ వద్ద ఒక లోడింగ్ వాహనం దొంగిలించిన ఘటనతో కూడా ఈ మాఫియాకు సంబంధం ఉన్నట్టు సమాచారం.
ఇలాంటి ప్రమాదకర మోసాలపై అధికారులు మౌనంగా ఉంటే, ప్రజలే వీరికి తగిన బుద్ధి చెబుతారని బాధితులు హెచ్చరిస్తున్నారు. చట్టం చేతిలోనూ, ప్రజల చేతిలోనూ తప్పించుకోలేరు అనేలా చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Author: chandre Prakash
నిర్మల్ డిస్టిక్. స్టాఫ్ రిపోర్టర్. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్. ప్రకాష్. +91 90102 20533








