. పేదల రేషన్ ఆశలపై దళారుల పంజా..! రూ.1500 నుంచి రూ.2000 దోచుకుంటున్న ముఠా. రేషన్ కార్డు.. ప్రభుత్వం ఎక్కడి నిర్ణయం.. దళారుల దందాలు మాత్రం ఆగట్లేదు!. పేదల్ని మోసం చేస్తున్న వారిపై నిఘా పెట్టండి..! అధికారులు ఏమిస్తున్నారో..?
నిజామాబాద్ జిల్లాలో రేషన్ కార్డు పేరిట దళారుల దోపిడీ..!
పేద ప్రజలను మోసం చేస్తూ రూ.1500 నుంచి రూ.2000 వరకు వసూలు చేస్తూ నిర్విరామంగా దళారులు అష్టదిశల్లో విస్తరిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డులు జారీ స్పష్టంగా తెలిపినా, అదే అంశాన్ని అవకాశంగా మార్చిన దళారులు మండల కేంద్రాల్లో మరియు గ్రామాలలో పేదలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. “సర్వర్ వర్క్ చేయడం లేదు”, “15 రోజులు పడుతుంది”, “వెంటనే చేయాలంటే డబ్బు పెట్టాలి” అంటూ అధికారుల ముసుగులో సెటిల్మెంట్లు నడుస్తున్నాయి.
వాస్తవానికి ఇదంతా ఓ ప్రణాళికాత్మక దోపిడీ. కొందరు అధికారుల పాలిటికే ఇది తెలియని విషయం కాదు. కానీ స్పందన లేకపోవడంతో దళారులకు రెక్కలు వచ్చాయి.
ప్రజలుCollector కార్యాలయం మరియు రెవెన్యూ శాఖ వద్ద నిరాశ చెందుతున్నారు. “మీ సేవ” కేంద్రాల నుంచే దళారులు వసూళ్లు చేస్తున్నారు. అర్హత ఉన్నవారికి మాత్రమే కార్డులు ఇచ్చే ప్రక్రియను దళారులు మలుపుతిప్పి నగదు బాగా గిట్టే వ్యాపారంగా మార్చుకున్నారు.
ఇలాంటి వ్యవస్థపై అధికారి స్థాయిలో నిఘా వేసి, జిల్లా స్థాయి లో విచారణ చేపట్టి, దళారులకు ఆశ్రయం ఇస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి.
పేదల రేషన్ ఆశలను మోసం చేయడాన్ని పరిగణనలోకి తీసుకొని వెంటనే ప్రభుత్వ యంత్రాంగం స్పందించకపోతే.. ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యాపిస్తుంది.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....









