V1News Telangana

best news portal development company in india

24న పీసీసీ పీఏసీ మీటింగ్: సీఎం రేవంత్, భట్టి, మంత్రులు హాజరు.. . పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీకి సిద్ధం: కీలక నిర్ణయాలు వీలయ్యే అవకాశం… గాంధీభవన్‌లో 24న పీఏసీ సమావేశం – లోకల్ బాడీ ఎన్నికలపై చర్చించనున్న నేతలు… . పార్టీ వ్యూహాలపై సమాలోచనకు కాంగ్రెస్ శిబిరం సిద్ధం… పీఏసీ సమావేశానికి సీఎం రేవంత్ హాజరు – కొత్త బాధ్యతల భరించనున్న నేతలు…

SHARE:

గాంధీభవన్‌లో పీసీసీ పీఏసీ భేటీకి రంగం సిద్ధం
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వ్యూహాలపై కీలక చర్చకు రంగం సిద్ధమైంది. జూన్ 24వ తేదీ ఉదయం 11 గంటలకు గాంధీభవన్‌లో పీసీసీ పీఏసీ (పోలిటికల్ అఫైర్స్ కమిటీ) మీటింగ్ జరగనుంది. ఈ సమావేశానికి పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షత వహించనున్నారు.

సమావేశానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, పీసీసీ కీలక నాయకులు హాజరుకానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది.

ఈ సమావేశానంతరం పీసీసీ అడ్వయిజరీ కమిటీ మీటింగ్ కూడా నిర్వహించనున్నారు. సమావేశంలో ఇటీవల నియమితులైన కొత్త పీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు నియామక పత్రాలను అందజేస్తారు. దీంతో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణపై స్పష్టత వచ్చే అవకాశముంది.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india