V1News Telangana

best news portal development company in india

బోధన్‌లో మెప్మా మహిళా సంఘాల ఆధ్వర్యంలో రుచుల రసవిందన — ఫుడ్ ఫెస్టివల్‌కు సబ్ కలెక్టర్…

SHARE:

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ మున్సిపాలిటీ మరియు మెప్మా సంయుక్త ఆధ్వర్యంలో 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈరోజు మునిసిపల్ కార్యాలయ ఆవరణలో భోజన ప్రదర్శన – ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో 20 మంది మహిళా సంఘాల సభ్యులు 20 స్టాల్స్ ఏర్పాటు చేసి వివిధ రుచికరమైన మరియు సంప్రదాయ ఆహార పదార్థాలను ప్రదర్శించారు. వీటిలో స్వీట్లు, స్నాక్స్, పచ్చళ్లు, మసాలా పొడులు, రాగి ఉండలు, నేతి బొబ్బట్లు, సర్వపిండి, బిర్యానీలు, గులాబ్ జామున్, పూర్ణం బూరెలు, మురుకులు, అరిసెలు వంటి ఇంటింటి వంటకాలు ఆకర్షణగా నిలిచాయి.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో గారు ఫెస్టివల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మహిళలు తయారు చేసిన స్వచ్ఛమైన ఆహార పదార్థాలకు మార్కెటింగ్ అవకాశాలు కల్పించేందుకు ఈ తరహా ప్రదర్శనలు ఉపయుక్తమవుతాయని తెలిపారు. ప్రభుత్వ శాఖలు అన్ని విధాలుగా సహకారం అందించనున్నాయని, అలాగే శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని తెలిపారు.
కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ, తహశీల్దార్ విట్టల్, మున్సిపల్ మేనేజర్ రమేష్, మెప్మా టీఎంసీ శ్రీనివాస్, కమ్యూనిటీ ఆర్గనైజర్లు, మహిళా సమాఖ్య ప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india