V1News Telangana

best news portal development company in india

చిన్నారులకు పాఠ్యపుస్తకాలకు చేయూతనందించిన కోనేరు ట్రస్ట్…..

SHARE:

– నేటి బాలలే రేపటి పౌరులని అభివర్ణన

– భవిష్యత్తులో కూడా వారి చదువులకు తోడ్పాటునందిస్తానని భరోసా

– పలు సేవా కార్యక్రమాలతో ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుంటున్న యువ నాయకులు

– బిజెపి నాయకులు, NRI కోనేరు శశాంక్

రుద్రూర్ ప్రతినిధి:

నిజామాబాద్ జిల్లా: బాన్సువాడ నియోజకవర్గం, రుద్రూర్ మండలం సిద్దాపూర్ గ్రామానికి చెందిన చిన్నారులు సిద్దార్థ 3rd క్లాస్, కృతిక్ కుమార్ 4th క్లాస్, నైనిక UKG, విగ్నేష్ 2nd క్లాస్, ప్రన్వీత్ 3rd క్లాస్, నిఖిలేశ్వరి 7th క్లాస్, శ్రీధన్య 1stక్లాస్ మొత్తం ఏడుగురు విద్యార్థులు బోధన్ పట్టణంలో గల ఆచార్య విద్యాలయంలో చదువుతున్నారు వారిచదువుల ఫీజులు చెల్లించడం కొరకు రుద్రూర్ మండల బిజెపి అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ బాన్సువాడ బిజెపి నాయకులు NRI కోనేరు శశాంక్ దృష్టికి తీసుకెళ్లగా మంచి మనసుతో వెంటనే ఆయన స్పందించి ఏడుగురు చిన్నారులకుపాఠ్యపుస్తకాలకు అయ్యే మొత్తం ఖర్చును రూ. 40,000 వేల రూపాయలు స్కూల్ యాజమాన్యానికి చెల్లించి కొనుగోలు చేసి వారికి పాఠ్య పుస్తకాలు అందజేశారు. గత సంవత్సరం కూడా ఈ విద్యార్థులకు కోనేరు శశాంక్ పాఠ్యపుస్తకాలు ఇప్పించడం జరిగింది .ఈ సందర్భంగా కోనేరు శశాంక్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు.. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని వారిని జీవించారు. వారి చదువుల విషయంలో భవిష్యత్తులో కూడా అండగా వుంటానని వారి తల్లి తండ్రులకి ఆయన భరోసా ఇచ్చారు. గొప్ప మనసుతో పాఠ్యపుస్తకాలు అందించినందుకుగాను విద్యార్థుల తల్లిదండ్రులు మరియు సిద్దాపూర్ గ్రామ ప్రజలు, కోనేరు శశాంక్ , కోనేరు తరుణ్ సాయి తేజ, ఆ లపాటి హరికృష్ణ బాన్సువాడ నియోజకవర్గంలో చేస్తున్న పలు సేవా కార్యక్రమాల పట్ల అభినందిస్తూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india