V1News Telangana

సాలూరులో ప్రజల కన్నీళ్లు – కార్యకర్తల కబ్జాలకు అధికారుల ఆశీర్వాదమా? ఎమ్మెల్యే కనుమరుగవగా… సలహాదారుల రాజ్యం సాగుతోందా?

సాలూరులో ప్రజల కన్నీళ్లు – కార్యకర్తల కబ్జాలకు అధికారుల ఆశీర్వాదమా?
ఎమ్మెల్యే కనుమరుగవగా… సలహాదారుల రాజ్యం సాగుతోందా???
ఇదేనా సాలూర పాలన? – వర్గాల మధ్య నలిగిపోతున్న బీదవాడు!??
. ఇల్లుల కోసం పేదల కలలు కొల్లగొడుతున్న వారే.. పాలకులంటే ఇదేనా?
. కార్యకర్తలే ప్రభుత్వం – అధికారులకేం పని లేదు?
. ఇళ్ల కోసం అమ్ములపొదులుగా మారిన మానవత్వం – సాలూర ప్రజల అరుపు వినిపించండి!
ఇల్లు కోసం కలలు… బాధగా మిగిలినవే!
. . ఇదేనా పాలన? పథకాలు వంచనగా మారిన ప్రజల వేదన!
అర్హులకు నిషేధం, అనర్హులకు వరం – ఇదేనా ప్రభుత్వం?

సాలూరు మండలం – జూన్ 19:ఎమ్మెల్యే సారు ఉన్నత పదవి మీద ఆశలు పెంచుకున్నా, ఆ ఆశలు ప్రజల నమ్మకాన్ని మాత్రం పొందలేకపోయినట్లు తెలుస్తోంది. ప్రజలు ఎదురుచూస్తున్న న్యాయం… కార్యాలయాల తాళం వేసిన తీరు చూస్తే, ఇది పాలనా అనిపించడం లేదు – ఇది రాజకీయ నేతల ఆటలనే వెల్లడిస్తోంది.

ఇల్లుల కోసం కలలు కంటున్న పేద మహిళలు, ప్రభుత్వ పథకాలపై ఆశగా ఎదురుచూస్తుంటే… స్థానిక నాయకుల మద్దతుతో కార్యకర్తలు వారినే వాడుకుంటున్నారు. రెక్కలొచ్చిన డాబాలను కూల్చి, ప్రభుత్వ పథకాలపై నాటకాలు ఆడుతూ – “నువ్వు ఇప్పుడు, నేను తర్వాత” అన్న దురాలోచనతో వ్యవహరిస్తున్నారు.
ఇది చూస్తున్న అధికారుల మౌనం అనుమానాలకు తావిస్తోంది. ఒకే పార్టీ కార్యకర్తలు అధికారుల్లా వ్యవహరిస్తూ – నిర్ణయాలు తీసుకోవడం, ప్రజలను బెదిరించడం… నిజంగా ప్రజాస్వామ్యంలో జరిగే చర్యలా?
ప్రజలకు అర్హత ఉండి కూడా ఇళ్లు రాకపోవడం… అయితే, సంబంధాలు ఉన్నవారికి మాత్రం రెండో, మూడో ఇళ్లు రావడం… ఈ పాలనపై శ్వాస ఆగేలా చేస్తోంది. అధికారుల చేతుల్లో అధికారాలు లేవు – నాయకుల చేతుల్లోనే అన్న భావన ప్రజల్లో బలపడుతోంది.

ఈ అడ్డగోలుతనంపై అధికారులు స్పందించకపోతే, ప్రజలే తీర్పు చెప్పే సమయం దగ్గరగా ఉంది. నాయకులు, అధికారులు ఒక్కసారి ప్రజల కోపాన్ని చవి చూడాల్సిందే!

 

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Infoverse Academy

Vote Here

[democracy id="1"]

Recent Post

కల్దుర్కి ఇసుక మాఫియా… కండగావ్ ట్రాక్టర్లకు అడ్డుగోడలు! . ఇసుక పర్మిషన్ పేరుతో ట్రాక్టర్ ముఠాల ఆగడాలు.. ఎమ్మార్వోలా? ట్రాక్టర్ యజమానుల రాజ్యం కల్దుర్కిలో ఇసుక ముఠాల పంజా.. రెవెన్యూ అధికారుల మౌనం ప్రశ్నార్థకం! . ఇందిరమ్మ ఇళ్ల పేరుతో బ్లాక్ మార్కెట్ గేమ్?