V1News Telangana

best news portal development company in india

బోధన్‌లో ట్రాన్స్‌ఫార్మర్ మాఫియా షాక్ తినే రోజుదగ్గర..!

SHARE:

బోధన్‌లో ట్రాన్స్‌ఫార్మర్ దొంగతనాలకు చెక్..
దొంగతనాలపై పోలీస్-ఎలక్ట్రిసిటీ సంయుక్త యుద్ధం!
. ట్రాన్స్‌ఫార్మర్ దొంగలకు గట్టిచెయ్యి! బోధన్ పోలీస్ కమాండ్ మీట్..
. “ఇలాంటివి ఇక చెబితే చాలు” – బోధన్ ACP ఘాటుగా.

బోధన్, జూన్ 18:ఇటీవల బోధన్ పట్టణం మరియు పరిసర గ్రామాల్లో పెరిగిపోతున్న ట్రాన్స్‌ఫార్మర్ దొంగతనాలను అరికట్టేందుకు పోలీసు శాఖ, విద్యుత్ శాఖ మేలుకొని కూర్చుంది. బుధవారం రోజు బోధన్ ఏసీపీ శ్రీనివాస్ గారి నేతృత్వంలో, ఎలక్ట్రిసిటీ డీఈ ముకీద్ గారి సమన్వయంతో ACP కార్యాలయంలో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి బోధన్ టౌన్ SHO, రూరల్ CI, రుద్రూర్ CI, బోధన్ గ్రామీణ SHO, ఇద్దరు అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్లు (ADలు), మరియు ఎనిమిది మంది అసిస్టెంట్ ఇంజినీర్లు (AEలు) హాజరయ్యారు.

సమావేశంలో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తూ, ట్రాన్స్‌ఫార్మర్ దొంగతనాలపై పటిష్ఠ చర్యలు తీసుకోవాలని తేల్చారు. ప్రతి సంఘటనపై క్రిమినల్ కేసులు నమోదు చేసి దోషులను జైలుకు పంపేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.
“ఇక్కడ మాఫియా ఊచలు లెక్కపెట్టాలి. మనం సహనం కోల్పోతేనే న్యాయం జరగుతుంది” అంటూ ACP శ్రీనివాస్ తీవ్రంగా హెచ్చరించారు. విద్యుత్ శాఖ అధికారులు తమవంతు బాధ్యతగా సమయానికి సమాచారం అందిస్తూ పోలీసులతో సమన్వయం పెంచాలని చెప్పారు.ఈ సమావేశం ద్వారా బోధన్ వాసులకు ఒక నమ్మకాన్ని కలిగించింది – ఇక ముందు ఎలక్ట్రిక్ దొంగతనాలకు బోధన్‌లో స్థానం లేదన్న సంకేతాన్ని ఇచ్చింది.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india