V1News Telangana

best news portal development company in india

మంత్రులకు వార్నింగ్‌!  వేదికలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు: సీఎం రేవంత్..

SHARE:

విధానాలపై ప్రకటనలకు ముందు అనుమతి అవసరం: సీఎం స్పష్టతజూన్ 23న కీలక క్యాబినెట్ భేటీ – స్థానిక ఎన్నికలపై నిర్ణయం.. “ఇకపై కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకోవాలి” – రేవంత్‌ సందేశం మంత్రులకు… స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటనలపై సీఎం అసంతృప్తి…

 

తెలంగాణ రాష్ట్ర మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కఠిన సూచనలు చేశారు. ప్రభుత్వ విధానాలపై బహిరంగ వేదికలపై ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యానించవద్దని వార్నింగ్ ఇచ్చారు. సోమవారం బంజారాహిల్స్‌ సమీకృత పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో నిర్వహించిన సమావేశంలో సీఎం మంత్రులతో కీలకంగా మాట్లాడారు.

ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల విషయమై కొన్ని మంత్రుల వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీశాయి. ముఖ్యంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన నియోజకవర్గ పర్యటనలో ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో వస్తుందని చెప్పడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం, విధానపరమైన నిర్ణయాలపై అధికారిక ప్రకటనలు కేబినెట్‌లో చర్చ అనంతరం మాత్రమే ఉండాలన్నారు.

ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ స్పష్టంగా పేర్కొన్నారు:

> “ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఒకటిగా ఉండాలి. ప్రతి ఒక్కరూ ఒకే మాట మాట్లాడాలి. బహిరంగ వేదికలపై మంత్రులు ప్రకటనలు చేయొద్దు.”

 

ఇక జూన్ 23న కేబినెట్ భేటీ నిర్వహించనున్నారు. అందులో స్థానిక సంస్థల ఎన్నికలపై, మొదటగా ఏ స్థాయిలో ఎన్నికలు నిర్వహించాలన్న అంశంపై, బీసీలకు రిజర్వేషన్ల అమలుపైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించిన రెండు బిల్లులను ప్రవేశపెట్టి కేంద్రానికి పంపింది. కేంద్రం నుండి స్పందన రాకపోతే పార్టీ స్థాయిలో అమలు చేసేందుకు సిద్ధమని ప్రభుత్వం భావిస్తోంది.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india