V1News Telangana

best news portal development company in india

పేద ప్రజలకు కొండంత అండగా సేవలందిస్తున్న కోనేరు ట్రస్ట్….

SHARE:

– పేద విద్యార్థి చదువు కొరకు రూ.10000 ఆర్థిక సహకారం అందజేత

– శరణన్న వారిని అక్కున చేర్చుకుంటున్న మనసున్న మహారాజు

– పలు సేవా కార్యక్రమాలతో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న వైనం

– బిజెపి నాయకులు, NRI కోనేరు శశాంక్

రుద్రూర్ ప్రతినిధి:

నిజామాబాద్ జిల్లా: బాన్సువాడ నియోజకవర్గం రుద్రూర్ మండలంలోని రాయ్ కూర్ గ్రామానికి చెందిన బేకరి సాయికుమార్ అనే విద్యార్థి బాన్సువాడ శశాంక్ కాలేజీలో MSW కోర్సు విద్యనభ్యసిస్తున్నాడు. నిరుపేద కుటుంబానికి చెందిన యువకుడు కావడం వలన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తన చదువు ఫీజు చెల్లించుకోవడానికి ఆర్థిక సహకారం అందించాలని కోనేరు ట్రస్టును ఆశ్రయించారు. రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ చొరవ తీసుకొని సమస్యను NRI కోనేరు శశాంక్ దృష్టికి తీసుకెళ్లారు.. సమస్యను తెలుసుకున్న అతను వెంటనే స్పందించి మానవతా దృక్పథంతో కోనేరు చారిటబుల్ ట్రస్ట్ తరపున ఆదివారం రోజు బేగరి సాయికుమార్ కు కోనేరు తరుణ్ సాయి తేజ చేతుల మీదుగా రూ.10000 ఆర్థిక సహాయం అందించారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తనకు గొప్ప మనసుతో ఆర్థిక సహాయం అందించినందుకు గాను కోనేరు ట్రస్టు యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పలు సామాజిక సేవా కార్యక్రమాలతో అందరికీ అండగా నిలుస్తున్నందుకు గ్రామ మరియు మండల ప్రజలు పలువురు NRI,కోనేరు శశాంక్ ను ప్రశంసించారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india