V1News Telangana

best news portal development company in india

ఒకటే మాట – ఓటు వేసినవారికే పథకాలు! ఎన్నికల తర్వాతే అన్నీ ఇస్తామంటున్న కాంగ్రెస్‌ నేతలు – ప్రజల్లో ఆగ్రహం

SHARE:

రాష్ట్రవ్యాప్తంగా స్పష్టమవుతోంది – కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు చేరాలంటే ఓటు వేయాల్సిందే.

రైతు భరోసా పేరుతో డబ్బులు ఇచ్చే పథకం మూడో విడత ఇంకా రైతుల ఖాతాల్లో పడలేదు. ఇందిరమ్మ ఇల్లు పథకం కింద మంజూరైన ఇళ్ళకూ గట్టి తాళం. రేషన్ కార్డులు, పింఛన్లు, రేషన్ సరఫరా అన్నీ స్తంభించిపోయాయి. అధికారుల వాదన ఏమిటంటే – “స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే ప్రక్రియలు మొదలవుతాయి.”

రాజీవ్ యువ వికాసం – పథకం ఉందో లేదో స్పష్టత లేదు. లబ్ధిదారుల ఎంపికైతే పూర్తిగా వాయిదా. పథకాన్ని ప్రచార పుస్తకాల్లో మాత్రం విస్తృతంగా ప్రస్తావిస్తున్నారు. ఎన్నికల ముంగిట ఒక్క మండలానికి ఒక ఇల్లు పూర్తి చేయాలని పై నుంచి వచ్చిన ఆదేశాలు చూస్తుంటే – ప్రజల కంటే ఓట్లు ముఖ్యమన్న మానసికత్వం స్పష్టమవుతోంది.

పెట్టిన దరఖాస్తులపై కనీస స్పందన లేకుండా, రేషన్ కార్డుల ఎంపిక ప్రక్రియ ఒక్క అడుగు కూడా ముందుకు కదలదు. ఇదే సమయంలో వచ్చే రెండు నెలలు తొలి తేదీనే పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం – ఓటర్ల మన్నన కోసమేనన్న వాదన బలపడుతోంది.

పథకాలు ఇచ్చే ముహూర్తం కూడా ఓటింగ్ షెడ్యూల్ మీదే ఆధారపడి ఉండటాన్ని చూసి ప్రజలు ఒక్కటే ప్రశ్నిస్తున్నారు –
“ఇది ప్రజల పాలనా? లేక ఓట్ల కోసం నాటకం?”

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india