V1News Telangana

best news portal development company in india

బోధన్‌లో వర్షాకాల ముందస్తు ఏర్పాట్లపై సమీక్ష సమావేశం – ఆరోగ్య భద్రతపై ప్రత్యేక దృష్టి…

SHARE:

బోధన్, జూన్ 13:బోధన్ సబ్ కలెక్టర్ గారి నేతృత్వంలో శుక్రవారం మునిసిపల్ కమిషనర్, DLPO, MEO మరియు డిప్యూటీ DMHOలతో కలిసి వర్షాకాల ఏర్పాట్లు, సీజనల్ వ్యాధుల నివారణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో కింది అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు:

1. బోధన్ మునిసిపాలిటీ పరిధిలోని అన్ని కాలువల డీ-సిల్టింగ్ తక్షణమే పూర్తి చేయాలని సూచించారు…
2. మునిసిపాలిటీలు మరియు గ్రామ పంచాయతీల్లో నీటి నిల్వ ప్రాంతాలు, ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి పరిశుభ్రతకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు…
3. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు పాఠశాలలు, వసతిగృహాలు, ఇతర సంస్థల్లో ఆరోగ్య పరిశీలన చేపట్టి అవగాహన కల్పించాలని సూచించారు….
4. ప్రజల్లో సీజనల్ వ్యాధులపై అవగాహన పెంచేందుకు IEC (సమాచారం, విద్య, ప్రచారం) కార్యక్రమాలు నిర్వహించాలన్నారు…
5.గత సంవత్సరాల అనుభవాలను ఆధారంగా చేసుకొని మలేరియా, డెంగ్యూలు అధికంగా కనిపించే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు….
6. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మలేరియా, డెంగ్యూ పరీక్షల కిట్లు, పాముకాటుకు చికిత్సకు అవసరమైన ఔషధాలు, ఇతర అత్యవసర మందుల సమృద్ధిని కల్పించాలన్నారు….

ఈ సమావేశం ద్వారా వర్షాకాలంలో ప్రజారోగ్యం పట్ల అధికార యంత్రాంగం నిబద్ధతను మరింత బలోపేతం చేయాలని స్పష్టం అయింది.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india