V1News Telangana

best news portal development company in india

ఇల్లు కావాలంటే నేత చెప్పినవాడవ్వాలి – సాలూరులో నిబంధనలు పక్కనపెట్టి ‘పట్టు’ రాజకీయం..అధికారులు మౌనంగా, నాయకులు నేరుగా – సాలూరులో ఇల్లు కేటాయింపుల్లో రాజకీయ రంగు…

SHARE:

ఇంద్రమ్మ ఇల్లు కేటాయింపులో అధికారాల లొంగుడు – సాలూరులో కాంగ్రెస్‌ నాయకులే ‘ప్రభుత్వం’. అట వినికిడి??

పేదలకి ఇల్లు అనే కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇంద్రమ్మ ఇల్లు పథకం, కొన్ని ప్రాంతాల్లో అసలు ఉద్దేశం నుండి తూర్పు దిక్కుకు తిరుగుతోందని ప్రజలు గళం ఎత్తుతున్నాడట..??
సాలూర మండలంలో ఈ పథకం కేటాయింపులు అధికారుల చేతుల్లో లేవు… అక్కడ అసలైన నిర్ణయం తీసేది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే. నట ఎవరికివ్వాలన్నది వాళ్ళే తేలుస్తున్నారు. అధికారులైతే కేవలం ఓ ముద్ర వేసే యంత్రాల్లా మారిపోయా రాట నాయకులు చెప్పిన పేర్లు పట్టికలో ఉంటేనే ఇంటి కేటాయింపు సాధ్యమవుతోందట?
గ్రామంలో ప్రజలు అర్హతలు ఉన్నా… పార్టీలో లేరన్న కారణంతో పక్కనపడుతున్నారు. అధికారులకైతే తన స్వభావం విస్మరించి, నాయకుల అడుగులో అడుగు వేసే పనిలో పడ్డారు.

ఇది ప్రభుత్వ పథకమా? లేక రాజకీయ పార్టీ ప్రైవేట్ ప్రాజెక్టా? అన్న చర్చ ప్రజల మధ్య సాగుతోంది.అధికారులు ప్రజల పక్షాన నిలబడాలి కానీ నేతల చెంతకు వాలిపోవడం సరికాదంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇల్లు కావాలి అంటే పార్టీ మారాల్సా? అనే చింత పేదల మనసుల్లో తండ్రాడుతోంది.
ఇటువంటి దుర్వినియోగాన్ని సీఎం గారు. మరియు మన ఎమ్మెల్యే గారు. స్వయంగా పరిశీలించి, నిజమైన అర్హులకు న్యాయం జరగాలన్నది ప్రజల విజ్ఞప్తి….

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india