V1News Telangana

best news portal development company in india

రాష్ట్రంలో ఐఏఎస్‌ల ఊత పటాకా! నిజామాబాద్‌కు వినయ్ కృష్ణారెడ్డి – బాబు బదిలీల బాంబు పేలింది!

SHARE:

తెలంగాణలో పాలనా యంత్రాంగంలో బలమైన కదలికలు చోటుచేసుకున్నాయి. ఒక్కరోజులోనే ప్రభుత్వం 13 మంది ఐఏఎస్ అధికారుల్ని బదిలీ చేస్తూ గజగజలాడించింది. వీరిలో వినయ్ కృష్ణారెడ్డి కీలకంగా నిలిచారు. ఆయనను నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌గా నియమించింది ప్రభుత్వం. ఈ నిర్ణయం జిల్లాలో కొత్త జోష్‌కు నాంది పలకనుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.

 

రాష్ట్రవ్యాప్తంగా 13 మంది IAS, 3 మంది IFS, 70 మంది రేవెన్యూ అధికారులు బదిలీ

హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ జాయింట్ సెక్రటరీగా ఉన్న వినయ్ కృష్ణారెడ్డి, నిజామాబాద్ కలెక్టర్‌గా ప్రమోషన్

జిల్లాలో ఇప్పటికే చాలాకాలంగా పరిపాలనా స్తబ్దత నేపథ్యంలో ఈ బదిలీ కీలకం

ప్రజలతో మమేకం, కృషితో గుర్తింపు తెచ్చుకున్న వినయ్‌పై విస్తృతంగా ఆశలు

ప్రజా స్పందన ఎలా ఉంటుందో చూడాలి…
వినయ్ కృష్ణారెడ్డి ఇటీవలి కాలంలో గ్రామీణాభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల చూపిన దృక్పథం జిల్లాలో పునరుత్తేజానికి దారితీస్తుందన్న ఆశ.
అయితే, గత కలెక్టర్ల మాదిరిగానే పరిమిత వ్యవధిలో ఫైల్ కదలికలకే పరిమితం కాకుండా, నిజమైన ప్రజల పాలన కోసం నడవాలన్నది ప్రజల కోరిక.

 

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india