V1News Telangana

best news portal development company in india

పాఠశాల గోడ కూలి విద్యార్థి కాలు విరిగినా అధికారులు మౌనమే ఎందుకు? జనసేన ఘాటు డిమాండ్: 25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి – Collector స్పందించకపోతే ఆందోళన తప్పదు❗

SHARE:

నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని అంతర్ని గ్రామ ప్రభుత్వ పాఠశాలలో గోడ కూలిన ఘటనపై అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని జనసేన పార్టీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, కాలు విరిగిన విద్యార్థి ప్రస్తుతం భైంసా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

గత నాలుగు రోజులుగా ఈ విషయంలో జిల్లా విద్యాధికారి పట్టించుకోకపోవడాన్ని జనసేన ఖండించింది. విద్యార్థి జీవితమే నిలిచిపోయేలా మారిందని, అతని భవిష్యత్తు ఊహించలేనిది అయిందని మండిపడుతున్నారు జనసేన నిర్మల్ జిల్లా నాయకుడు సుంకేట మహేష్ బాబు.

“ఇలాంటి నిర్లక్ష్యం దారుణం. బాధ్యత వహించాల్సినవారు ఏమీ చేయడం లేదు. Collector వెంటనే జోక్యం చేసుకోవాలి. విద్యార్థికి ప్రైవేట్ హాస్పిటల్‌లో మెరుగైన చికిత్స, కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి” అని ఆయన డిమాండ్ చేశారు.

“ప్రభుత్వం స్పందించకపోతే, మా పోరాటం తీవ్రతరం చేస్తాం. అప్పుడే ప్రభుత్వ మెడలు వంచాల్సి వస్తుంది. బాధ్యత ప్రభుత్వందే అవుతుంది” అని హెచ్చరించారు.

ఈ నిరసన కార్యక్రమంలో విద్యార్థి కుటుంబ సభ్యులతో పాటు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గైని మురళి తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం ఇంకా నిద్రలేవకపోతే – జనసేన పోరాటం మరిగిపోనుంది!

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india